
పారిశ్రామిక అభివృద్ధికి యాంత్రాలే కీలకం, ముడి పదార్థాలు వస్తురూపం సంతరించుకోవడానికి యాంత్రాలు తోడ్పడతాయి. ఆ యాంత్రాల తయారీ నుంచి అవి పనిచేయడం వరకు యావత్తు వ్యవహారం మెకానికల్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తుంది. సివిల్, ఎక్ట్రికల్ మాదిరిగానే మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ప్రాచీనమైనదే. దీని అభివృద్ధి ఫలితంగా నూతన యంత్రాలను, వాటి సహాయంతో ఉత్పత్తుల్లో కొత్తదనాన్ని చూడగలుగుతున్నాం.
ఒక్క మాటలో చెప్పాంటే, ప్రస్తుత ఆధునాతన సదుపాయాన్నింటికీ మూలం మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులో భాగంగా మెటీరియల్ సైన్స్ అంట్ మెటలర్జీ, మెషిన్ డ్రాయింగ్ థెర్మో సైన్సెస్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్, మెషీన్ డిజైన్, అప్లయిడ్ థెర్మో డైనమిక్స్, హీట్ ట్రాన్స్‌ఫర్, మెటల్ కటింగ్ తదితరాలు ఉంటాయి. నాలుగో ఏడాదిలో కోర్ అంశాలకు తోడు రెండు ఎలక్టివ్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనెట్ ఎలిమెంట్ప్, అనాలిసిస్, గేస్ డైనమిక్స్, ఎంట్రప్రెన్యూర్ షిప్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ నుంచి ఎంచుకోవాల్సి ఉంటుంది.
సివిల్, ఎలక్ట్రికల్ వంటి కోర్ సబ్జెక్టులతో ఉన్న అనుబంధం మేరకు గల అంశాలనూ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటో మెషీన్ రోబోటిక్స్, టర్బో మెకానిక్స్ తదితరాల్లో పీజీ చేసే అవకాశం ఉంటుంది.
మెకానికల్ ఇంజనీరింగ్‌ను అందిస్తున్న కాలేజీలోని సంబంధిత విభాగంలో కనీసం అయిదుగురు ఫ్రొఫెసర్లు, ఆరు నుంచి ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అన్నింటికీ మించి సకల సదుపాయాలతో కూడిన వర్క్‌షాప్ ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ విభాగాల్లో ఉపాధి భిస్తుంది. అలాగే యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులను బి హెచ్ ఇ ఎల్, హెచ్ ఎ ఎల్, డి ఆర్ డి ఒ, డి ఆర్ డి ఎల్ తదితర కంపెనీలు తీసుకుంటున్నాయి. కోర్ జాబ్‌కు తోడు సాప్ట్‌వేర్ వైపూ వెళ్శవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ చేయాంలటే శారీరకంగా బలంగా ఉండాన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు.