ప్రతి వస్తువు తయారీలో నానో టెక్నాలజీ ప్రభావం
ఉండబోతుంది. ఈ టెక్నాలజీ ఎంత ఉపయోగకరమైనదంటే అతి శక్తివంతమైన కెమికల్, బయోకెమికల్ ఆయుధాల ప్రభావాన్ని శరీరంపై పడకుండా దుస్తులను కూడా దీనిద్వారా రూపొందించవచ్చు. నానో అంటే అత్యంత సూక్ష్మమైనదని! అర్థం.
ఒక వస్తువును తక్కువ బరువుతో, తక్కువ ఖర్చుతో అతి దృఢంగా, విలువైనదిగా రూపొందించటమే నానో టెక్నాలజీ ఉద్దేశం. సైన్స్ మరియు టెక్నాలజీలో దీని ఉపయోగం ఎక్కువ. నానో కారణంగా ఫిజికల్, కెమికల్ మాగ్నటిక్ , ఆప్టికల్, మెకానికల్, ఎక్ట్రికల్ ప్రాపర్టీస్‌లో చాలా మార్పులు సంభవించాయి. అతి చిన్న వాటిని రూపొందించి తద్వారా ఆశించిన ప్రయోజనాలను సాధించడమనేది ఈ ప్రక్రియలో అంతర్భాగం. బయోసైన్స్, మెడికల్ సైన్స్, ఎన్విరాన్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, కాస్మటిక్స్, పెయింట్స్, సెక్యూరిటీ మొదలైన రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు సాధ్యం అవుతాయి.
ఉదాహరణకు అతి సన్నని మెడికల్ పరికరాలు, సెన్సర్లు తయారు చేయవచ్చు సూర్యకాంతిని విద్యుత్తుగా మార్పుచేయవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాున్నాయి. ఇంజనీరింగ్‌లో ప్రతి ఆవిష్కరణలో దీని ప్రమేయం ఉంటుంది. ఈ కోర్సు చదవాంటే సైన్స్‌పై మంచి పట్టు ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఇన్ఫర్మాటిక్స్, బయో టెక్నాలజీ మొదలైనవన్నీ ఈ కోర్సులో భాగమే.
ఇంజనీరింగ్ లేదా ఫిజిక్స్, కెమొస్ట్రీ, మేధ్స్, బయాజీల్లో ప్రాథమిక అవగాహన బాగుంటే, నానో టెక్నాలజీలో ఎంటెక్/పి హెచ్ డి చేసే వీలుంటుంది. ఇవి కనుక పూర్తయితే వీరికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంటుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాజీకి చెందిన నానో మిషన్ సెంటర్‌కు ప్రభుత్వం వెయ్యుకోట్ల రూపాయు కేటాయించటమే దీనికి లభిస్తున్న ప్రాధాన్యం తెలియజేస్తుంది. ఇందులో పరిశోధన పూర్తి చేసిన వ్యక్తులకు ఎంపిక చేసుకున్న సబ్జెక్టును బట్టి ఆరంభంలో నెలకు రూ.20,000`నుండి అయిదు లక్ష రూపాయల వరకు వేతనం లభిస్తుంది.