చమురు ద్రవ బంగారంగా ప్రసిద్ధి చెందినది. కృష్ణా, గోదావరి బేసిన్ మొదలుకుని, వివిధ ప్రాంతాలో చమురును వెలికి తీసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు ముమ్మరంగా సాగ్నుతున్నాయి.
ఓ ఎన్ జి.సి కి తోడు రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు సైతం చమురు వెలికితీతలో నిమగ్న్నమవుతున్న విషయం తెలిసిందే. 2017 నాటికి 800 మంది పెట్రో సంబంధ సాంకేతికత తెలిసిన వ్యక్తులు అవసరమవుతారని ఒక అంచనా.
పెట్రోలియం ఇంజనీరింగ్ లేదా పెట్రో కెమికల్ ఇంజనీరింగ్‌లో ఏదైనా తీసుకోవచ్చు. ఈ రెంటిలో ఏదో ఒక దానిలో నాలుగేళ్ళ బిటెక్‌ను చేయాల్సి ఉంటుంది.
ఇదే రంగంలో ప్రత్యేకించి ఎం బి యే కోర్సు సైతం వస్తున్నాయి. ప్రాథమికంగా ముడి చమురు నుంచి అవసరమైన వాటిని వివిధ పద్ధతులను ఉపయోగించి పొందుతారు.
పెట్రో బిటెక్ కోర్సులో భాగంగా మేథ్స్, ప్రాథమిక సైన్స్ వంటి ప్రాథమిక అంశాలకు తోడు రిజర్వాయర్ పెట్రో ఫిజిక్స్, పెట్రోలియం ఇంజనీరింగ్ సిస్టమ్స్, డ్రిల్లింగ్ అండ్ ప్రొడక్షన్ సిస్టమ్స్, జియో స్టాటిస్టిక్స్, వెల్ ఫర్ఫార్మెన్స్, రిజర్యాయర్ ఫ్లూయిడ్స్, పెట్రోలియం ప్రాజెక్ట్ ఎవల్యూషన్, ఇంజనీరింగ్ ఎథిక్స్, బెల్ కంప్లీషన్ అండ్ స్టిమ్యులేషన్ తదితరాలను అధ్యయనం చేస్తారు.
పెట్రోలియం ఇంజనీర్లు ఎక్కువగా జాబ్ సైట్లలోనే పనిచేస్తారు. కన్సల్టెంట్లకు మాత్రమే ఒక మేర ఆఫీసులో పని ఉంటుంది. ఈ రంగంలో ఎదుగుదల 2016 వరకు ఏటా అయిదు శాతం మేర ఉండనుంది. ఇప్పటకి డిమాండ్ కంటే తక్కువగా పెట్రోలియం ఇంజనీర్లు ఉన్నారు. అందువల్ల ఈ కోర్సు చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు.