ప్రాధమిక అవగాహన
సమస్యలు వస్తే ప్రతి విశ్వవిద్యాలయంలో ఇండియన్ విద్యార్థుల అసోసియేన్లు వుంటాయియి. ఇండియన్ కాన్సులేట్లు ప్రతిదేశంలో వుంటాయి. వీరిని సంప్రదించవచ్చు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించవలసిందే. ప్రాంతాలు మారినపుడు వాతావరణ మార్పుల కారణంగా ఆనారోగ్యంపాలు కావచ్చు. మనకిపుడు చలికాలం అయితే కొని చోట్లు వేసవికాలం. మనకు ఎండాకాలం అయితే కొన్నిచోట్ల చలికాలం కావచ్చును. ఆస్థమా, సైనస్‌తో బాధపడేవారికి శ్యాసకోసాల ఇబ్బంది రావచ్చును. కాబట్టి వెళ్ళే ప్రదేశం గురించి పూర్తి అవగాహన వుండాలి.
ఇంగ్లీష్ మీడియం : మీరు ఎంచుకునే విద్యాసంస్థలలో ఇంగ్లీష్ మాధ్యమం ఉన్నదా లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని దేశాలలో కొన్ని విద్యాసంస్థలలో స్థానిక భాషలోనే బోధన ఉంటుంది. ముఖ్యంగా జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలలో కొందరు విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది.
విద్యాపరమైన అర్హతలు : చేరదల్చిన విద్యాసంస్థలో ప్రవేశానికి అవసరమైన అర్హతలు తమకున్నాయో లేదో చూసుకోవటం విద్యార్థుల ప్రాథమిక విధి. విద్యార్హతలే కాకుండా ప్రత్యేక టెస్టుల స్కోర్లను చాలా విద్యాసంస్థలు పరిగణనలోకి తీసుకుంటాయి. TOFFEL / IELTS ఇంగ్లీష్ టెస్టుల స్కోర్లు అవసరమవుతాయి.
సాంకేతిక కోర్సులకు GRE ని మేనేజ్ మెంట్ విద్య కోసం GMAT ను తప్పనిసరిగా చేసిన సంస్థలు. మరికొన్ని బ్యాచిలర్ కోర్సు చేయాలనుకున్న విద్యార్థుల SAT స్కోరును కొన్ని సంస్థలు చూస్తున్నాయి.
కొన్ని దేశాలగురించి : కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు స్థిరపడే అవకాశాలను అందిస్తున్నాయి. యూ.కె. ఐర్లాండ్ వేగవంతమైన కోర్సులను, సంపాదించే అవకాశాలను ఇస్తున్నాయి. పరిశోధనకూ, ఉత్తమశ్రేణి విద్యానైపుణ్యానికి యు.ఎస్.ఎ. వీలు కల్పిస్తుంది. జర్మనీ, స్వీడన్ లాంటి దేశాల్లో తక్కువ ఫీజుకే చదువుకునే సౌకర్యం వుంది.