ఆస్ట్రేలియా వీసా ఇంటర్వ్యూకు విద్యార్ధి హాజరయ్యే అవసరం లేదు. డ్రాప్‌బాక్స్ వీసా పద్ధతిగా దీన్ని చెప్పవచ్చు విద్యార్ధి అన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తే న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హైకమీషన్ వాటిని ప్రాసెస్ చేస్తుంది.
దరఖాస్తులు అన్‌లైన్‌లో పంపించే ఈ-వీసా పద్ధతికూడా ఉంది. దీనిలో ఆస్ట్రాలియాలోని ఆడిలైడ్‌లో దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు. డ్రాప్‌బాక్సు పద్ధతే ఎక్కువ ప్రాచుర్యం పొందినది, ఎక్కువమంది ఉపయోగిస్తున్నది.
నిధుల లభ్యత మార్గాలు ఈ రూపంలో:
1. ఫిక్సెడ్ డిపాజిట్లు - 3 నెలల కంటే ముందువి /6 నెలలవి.
2. బ్యాంకు బ్యాలన్సులు 3 నెలలకంటే ముందువి/6 నెలలకు.
3. విద్యారుణాలు : అంగీకృత ఆర్థిక సంస్థల నుంచి.
4. తపాలా డిపాజిట్లు ఏడాది కంటే పాతవి.
5. ప్రావిడెట్ ఫండ్ : విత్ డ్రా చేసుకోగలిగిన మొత్తం - తల్లిదండ్రులవి మాత్రమే.
6. వ్యక్తిగత రుణం/డిమాండ్ రుణం : అంగీకృత మార్గాల నుంచి.
నిధులను ఈ మార్గాల ద్వారా చూపవచ్చు. అయితే అది విద్యార్థి చదివే కోర్సు స్థాయిని బట్టి ఉంటుంది. విద్యార్థి బ్యాచిలర్, మాస్టర్స్ చదవబోతుంటే అతడు అసెస్‌మెంట్ లెవలెల్ 3 కిందకి వస్తాడు.
3 నెలల కింది నిధులను చూపించవచ్చు. ఏవరినైనా స్పాన్సర్‌గా పెట్టుకోవచ్చు. విద్యార్థి డిప్లొమా చదువుతుంటే అతడు అసెస్‌మెంట్ లెవెల్ 4 కిందకి వస్తాడు. నిధులను 6 నెలల కిందివి చూపించాల్సివుంటుంది. రక్త సంబంధీకులు మాత్రమే స్పాన్సర్లుగా ఉండాలి.
వీసాకు అవసరమయ్యే నిధులు : కోర్సుకు ట్యూషన్ ఫీజు: + జీవనవ్యవం (ఏడాదికి 18000 డాలర్లు) + ప్రయాణ, ఇతర ఖర్చులు (200 డాలర్లు) కోర్సు వ్యవధికి తగ్గట్టుగా విద్యార్థి నిధులు చూపాల్సి వుంటుంది. స్సాన్సర్ల నుంచి తగిన ఆదాయం కూడా చూపాలి. వీసా సమాచారం కోసం చూడాల్సిన లింకు:
www.immi.gov.au/students