telugu kiranam

How to get UK Visa… యు.కె వీసా ఎలా పొందాలి?...

How to get UK Visa… యు.కె వీసా ఎలా పొందాలి?...
యు.కె లో వీసా ప్రక్రియ యు.ఎ.యస్‌.తో పోలిస్తే తేలికగా ఉంటుంది . విద్యార్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వనవసరం లేదు. వారు అన్ని డాక్యుమెంట్లతో కలిపి పూర్తి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.7-15 రోజుల్లో ప్రక్రియ ముగుస్తుంది
దరఖాస్తులు ఆన్‌లైన్‌లో భర్తిచేసి సమర్పించటం కోసం తేదీ, సమయం, అపాయంట్ మెంట్ తీసుకోవాలి. యు.కెలో చదవానికి వీసా కోసం, న్యూపాయింట్స బేస్డ్‌ సిస్టమ్‌కు చెందిన Tier 4 - students క్యాటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలి. వీసా దరఖాస్తుఫారం, వీసా సమాచారం పత్రాలు లభించే లింకు :
http::/ www.ukba.homeoffice.gov.uk/ visas-immegration
దరఖాస్తు ఫీజు 255 పౌండ్లు.(2016)
ఆర్థిక సామర్థ్యం నిరూపణకు: వీసా దరఖాస్తు తేదీ నాటికి నిధులు కనీసం 28 రోజుల క్రితానివి అయి ఉండాలి. సేవింగ్సు లేదా కరెంట్ అకౌంట్లో లభ్యమయ్యేలా ఉండాలి. అకౌంట్ విద్యార్థి పేరు మీదగానీ, స్పాన్సర్‌+విద్యార్థి పేర ఉమ్మడి అకైంట్ గానీ ఉండాలి 2009 ఆగస్టు 21 నుండి నిధులు తల్లిదండ్రుల పేర కూడా నిధులు చూపవచ్చని వెసులుబాటు కల్పించారు. ఫిక్సెడ్‌ డిపాజిట్లుంటే వాటి లభ్యత గురించి బ్యాంకులు నిర్థారణ లేఖ ఇవ్యాల్సి వుంటుంది. గరిష్టంగా 28 రోజుల లోపల నగదుగా మారేలా ఉండాలి. విద్యారుణం తీసుకునివుంటే బ్యాంకు మంజూరు లేఖ లేదీ నెలరోజులలోపుదై ఉండాలి. రుణ ఒప్పండం లేదా నియమనిబంధనల కాపీ కూడా జతచేయాలి. ఒకవేళ వీసా మంజూరుపై ఆధారపడే రుణ మంజూరు ఉండి వుంటే యు.కె. ప్రయాణించే సమయానికి రుణం పొందవచ్చు
నిధులు ఇలా చూపాలి : లండన్‌లో విద్యాభ్యాసమైతే : మొదటి సంవత్సరం ట్యూషన్‌ ఫీజు+7200 పౌండ్లు (గరిష్టంగా 9 నెలలు) విద్యాభ్యాసం లండన్‌ వెలుపల అయితే : మొదటి సంవత్సరం ట్యూషన్‌ ఫీజు: +5,400 పౌండ్లు (గరిష్టంగా 9నెలలు)
అవసరమైన డాక్యుమెంట్ల జాబితా :
1. VFAF 9 + అపెండిక్స్‌ 8 ఫార్మ్‌ (టయర్‌ 4-విద్యార్థి) గైడెన్స్‌ నోట్స్
2. పాస్‌పోర్టు
3. ఒకపాస్‌పోర్టు సైజ్‌ ఫోటో (45x35 మి.మీ.కలర్‌ ఆర్నెల్ల లోపుది)
4. బయోమెట్రిక్‌ వివరాలు
5. వీసా ఫీజు 255 పౌండ్లు (సమానమైన రూపాయలు. డీడీ రూపంలో) (2016)
6 విశ్వవిద్యాలయం నుంచి లేఖ. అన్ని డాక్యుమెంట్ల ఒరిజినల్‌ మరియు ఫోటో కాపి.
7. విశ్వవిద్యాలయం నుంచి బేషరతు ప్రతి.
8. ATAS సర్టిఫికెట్ (అవసరమైతే)
9.వసతి ట్యూషన్‌ రుసుము చెల్లింపు రసీదులు
10.బ్యాంకు స్టేట్ మెంట్లు - స్పాన్సర్లందరి నుంచి గత 28 రోజుల ఒరిజినల్స్‌)
11. టెన్త్‌ నుంచి చివరి డిగ్రీ వరకూ మార్క్‌షీట్లు
12. స్పాన్సర్‌కు సంబంధించిన అఫిడవిట్ - 20 రూపాయుల నాన్‌ జ్యూడిషయల్‌ స్టాంప్‌ పేపర్‌పై
13. వర్క్‌ అనుభవం సర్టిఫికెట్
14. ఫిక్సెడ్‌ డిపాజిట్ల రసీదులు (అవసరమైతే)
15. బ్యాంకు రుణ మంజూరు లేఖ (అవసరమైతే)