s
ELAM (Latin American School of Medicine) Cuba
ప్రపంచంలోని బీదవారికి ఉచితంగా వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఫెడరల్ క్యాస్ట్రో ఏర్పాటు చేశారు. 1999 వ సంవత్సరంలో మొదలు పెట్టబడిన ఈ వైద్యకళాశాల పూర్తిగా క్యూబా ప్రభుత్వంచే నిర్వహించబడుచున్నది. ఈ వైద్యవిద్య 5 సంవత్సరాలు మరియు ఒక సంవత్సరం పి.జి చేయాల్సి ఉంటుంది.
వైద్యవిద్యను అభ్యసించే వారికి మూడుపూట్లా భోజనం, వసతి సౌకర్యం,పుస్తకాలు పూర్తిగా ఉచితం. అంతేకాదు ప్రతి విద్యార్ధికి ప్రతి నెలా 100 క్యూబన్ డాలర్లు స్టైఫండ్ ఇస్తారు. ఈ దేశంలో చదువుకునేందుకు ఉత్సాహం చూపే ఇతర దేశాల విద్యార్ధులు క్యూబా ఎంబసీని సంప్రదించి పూర్తి వివరాలు పాందగలరు.
వైద్యరంగంలో క్యూబా దేశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి రెండువందల ఇళ్లకు ఒక డాక్టర్, నర్స్, చిన్న పాలీక్లినిక్ ఉంటాయి. డాక్టర్లు రోగుల కోసం చూడరు. డాక్టర్లే రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యం చేస్తారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, వృద్ధులకు ఇళ్లవద్దే వైద్యం అందిస్తారు. ఆ దేశంలో వైద్యవిద్య తరువాత డాక్టర్లు తప్పనిసరిగా మూడు సంవత్సరాలపాటు సంఘసేవ చేయాలి.
ఈ సమాచారం చదివిన వారు దయచేసి మీ మిత్రులకు, బంధువులకు కూడా తెలపండి. వైద్యవిద్య చదవాలనుకునే బీద విద్యార్ధులకు ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలకు ఈ లింకును క్లిక్ చేయండి. https://en.wikipedia.org/wiki/ELAM_(Latin_American_School_of_Medicine)_Cuba