ఆధునిక జీవనం అవకాశాలతోపాటు ఒత్తిడినీ తీసుకొచ్చింది. దాని వల్ల రకరకాల సమస్యలతో మానసికంగా కుంగిపోతున్న వాళ్లెందరో మనచుట్టూ ఉన్నారు. వీరిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి క్లినికల్ థెరపిస్టుల సేవలు అవసరం. ఆ పనిని క్లినికల్ సైకాలజిస్టులు చేస్తుంటారు. సైకాలజీలో ఒక స్పెషలైజేషన్ కోర్సుగా క్లినికల్ సైకాలజీ ఉంటుంది. పీజీలో ఎమ్మెస్సీ క్లినికల్ సైకాలజీ కోర్సును పలు సంస్థలు అందిస్తున్నాయి. సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గాలను చూపే సమర్థత, ఎదుటివారు చెప్పింది ఓపికగా వినే సహనం ఈ రెండూ క్లినికల్ థెరపిస్టులకు ఉండాల్సిన లక్షణాలు.
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ - బెంగళూరు
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజీ అండ్ రిసెర్చ్- బెంగళూరుతోపాటు పలు యూనివర్సిటీలు క్లినికల్ సైకాలజీ కోర్సు అందిస్తున్నాయి