పర్యావరణ ప్రేమికులు ఎన్వైరాన్మెంటలిస్ట్ ఉద్యోగాల్లో రాణించడానికి అవకాశాలున్నాయి. వివిధ ప్రమాదాలు, విపత్తుల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించడమే ఎన్వైరాన్మెంటలిస్ట్ ప్రధాన విధి. నశించిపోతున్న జీవజాతుల మనుగడకు కృషి చేయడమూ వీరి విధుల్లో భాగమే.
సామాన్యశాస్త్రాలపై ఆసక్తి ఉన్నవాళ్లు పర్యావరణవేత్తలుగా రాణించే వీలుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్వైరాన్మెంటలిస్టులకు డిమాండ్ పెరిగింది. పర్యావరణంలో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులను పలు సంస్థలు, యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
* నేషనల్ ఎన్వైరాన్‌మెంటల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-నాగ్‌పూర్
ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ - డెహ్రాడూన్
జేఎన్‌యూ-దిల్లీ
దిల్లీ యూనివర్సిటీ
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ- ఉత్తర్ ప్రదేశ్ మొదలైనవి పర్యావరణ కోర్సులకు జాతీయస్థాయిలో ప్రసిద్ధమైనవి.