రుచిని పసిగట్టి అందులోని మంచి చెడులు వివరించగలరా...అయితే మీరు ఫుడ్ ఫ్లేవరిస్ట్ ఉద్యోగానికి తగినవారే. ఫుడ్ అంటే కేవలం తినుబండారాలనే కాదు. పానీయాలు, పోషక పదార్థ సప్లిమెంట్లు, టూత్ పేస్టు, ఔషధాలు, లిప్ బామ్స్, సౌందర్య ఉత్పత్తులు, సుగంధద్రవ్యాలు...వీటిలో దేని గురించైనా వివరించే నైపుణ్యం, తమ ఉత్పత్తికి సంబంధించి వివిధ కంపెనీలు తయారుచేసిన వాటిని విశ్లేషించడంపై ఆసక్తి ఉన్నవాళ్లు ఫుడ్ ఫ్లేవరిస్ట్ కెరియర్ దిశగా అడుగులేయవచ్చు.
సంస్థలు
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్‌మెంట్ - ముంబయి
* సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, మైసూరు
* శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
* డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ - ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ.