ఇటీవలి కాలంలో పర్వతాలను అధిరోహించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రభుత్వాలు సైతం విద్యార్థులను పర్వతాధిరోహణ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే పర్వతాలను నేరుగా వెళ్లి ఎక్కేయడం సాధ్యం కాదు. అందుకు తగ్గ ప్రాథమిక శిక్షణ తీసుకోవడం అనివార్యం. పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవాళ్లు, పర్వతారోహణ శిక్షకులుగా మారాలనుకున్నవాళ్లు ఈ మౌంటెనీరింగ్ కోర్సులో చేరవచ్చు. పలు సంస్థలు ఏడాదిలో పలుసార్లు బేసిక్, అడ్వాన్స్‌డ్ కోర్సులను అందిస్తున్నాయి.
* నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్, ఉత్తరకాశీ (ఉత్తరాఖండ్).
* వింటర్ స్పోర్ట్స్, పహల్గామ్-జమ్మూ కశ్మీర్
* అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్, మనాలీ, హిమాచల్ ప్రదేశ్
* హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్, డార్జిలింగ్, పశ్చిమ్ బంగ
* సోనమ్ గ్యాట్సో మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్, గ్యాంగ్‌టక్, సిక్కిం