ఆప్టికల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కలయికే ఫోటోనిక్స్. ఈ కోర్సులో చేరినవారు ఫోటాన్స్, కాంతి సూక్ష్మ కణాల గురించి అధ్యయనం చేస్తారు. కాంతి ఉద్ఘారం, ప్రసారం, తీవ్రత...మొదలైనవన్నీ తెలుసుకుంటారు. సైన్స్ అందులోనూ ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీలపై ఆసక్తి ఉన్నవారికి ఇది బాగా నప్పుతుంది. ఈ కోర్సు చదువుకున్నవాళ్లు ఇంజినీర్, సైంటిస్ట్, రిసెర్చర్, ప్రొఫెషనల్ ఆఫీసర్‌గా పలు కంపెనీలు, ప్రభుత్వ విభాగాల్లో పనిచేయవచ్చు. ఫోటోనిక్ పరికరాలను వీరు తయారుచేయవచ్చు. ప్రస్తుతం ఈ విభాగంలో నిపుణులు ఎక్కువగా లేరు. ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరినవెంటనే ఉద్యోగం పొందడానికి అవకాశాలు ఉన్నాయి.
సంస్థలు
ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫోటోనిక్స్
- కొచిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - న్యూదిల్లీ, చెన్నై
మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తదితర సంస్థలు ఫోటోనిక్స్ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు కూడా ఉన్నాయి.