గ్రామీణ భారతం గురించి తెలుసుకోవాలనుకునేవారికి, గ్రామాల అభివృద్ధిపై ఆసక్తి ఉన్నవారికి సరిపోయే కోర్సు రూరల్ స్టడీస్. పెంపుడు జంతువులు, పాడిపశువులు, వ్యవసాయం, పర్యావరణం, అడవులు, శిశువికాసం...తదితరాంశాలను కోర్సులో భాగంగా బోధిస్తారు. స్థానిక పరిస్థితులను, అక్కడున్న వనరులను ఉపయోగించి గ్రామాలను ఎలా అభివృద్ధి చేయవచ్చో ఈ కోర్సులో నేర్పుతారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. కోర్సు పూర్తిచేసివవాళ్లు వీటిలో ఉపాధి పొందవచ్చు.
సంస్థలు:
* భావ్‌నగర్ యూనివర్సిటీ, గుజరాత్
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, హైదరాబాద్
* ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, న్యూదిల్లీ
* తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు రూరల్ డెవలప్‌మెంట్‌లో రెండేళ్ల ఎంఏ కోర్సును అందిస్తున్నాయి.