టీలలో ఏది మంచిది, ఏది వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుందో తేల్చి చెప్పే నిపుణుల బృందాలు ఉంటాయి. వారే టీ టేస్టర్లు. మంచి తేయాకును గుర్తించడం, ఎంత మోతాదులో కలపాలో తెలుసుకోవడం, వాటికి గ్రేడ్లు ఇవ్వడం టీ టేస్టర్ పని. టీ పొడి తయారుచేసే కంపెనీలు, స్టార్ హోటళ్లు వీరిని నియమించుకుంటున్నాయి. ఇలాంటి ఉద్యోగాల్లో చేరాలనుకునేవారి కోసం డార్జిలింగ్ టీ రిసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మూడు నెలల వ్యవధి ఉండే టీ టేస్టింగ్ సర్టిఫికెట్ కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తిచేసినవాళ్లు అర్హులు. కోర్సు ఫీజు రూ.45,000. ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 25 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు.
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫ్యూచరిస్టిక్ స్టడీస్
అస్సాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్
టీ రిసెర్చ్ అసోసియేషన్
డిప్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్.