వైన్ రుచి ఎలా ఉంది, మరింత మెరుగుపడాలంటే ఏం చేయవచ్చు, ఏ ఫ్లేవర్ ఎంత మోతాదులో కలిపితే ఆ వైన్ అద్భుతంగా రూపొందుతుందో చెప్పడం వైన్ టేస్టర్ల బాధ్యత. పలు పదార్థాలతో తయారు చేసిన వైన్స్ కలిపి సరికొత్త ఫ్లేవర్లను వీరు ఆవిష్కరిస్తారు. వైన్ తయారీ కంపెనీలతోపాటు స్టార్ హోటళ్లు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. వైన్ అంటే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ప్రపంచంలోని ప్రసిద్ధ సంస్థలతోపాటు భారత్ లోనూ పలు అకాడమీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. డిగ్రీ అర్హతతో ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఇందులో లెవెల్ 1, 2, 3 కోర్సులు ఉంటాయి.
సంస్థలు:
* వైన్ అండ్ స్పిరిట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, లండన్
* విక్టోరియా యూనివర్సిటీ, మెల్బోర్న్
మనదేశంలో
* తుల్లీహో వైన్ అకాడమీ - ముంబయి
* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైన్ అండ్ బేవరేజ్ స్టడీస్ - దిల్లీ