header

Medical Courses….వైద్యవిద్య

Medical Courses….వైద్యవిద్య
Medical Courses….వైద్యవిద్య వైద్యవిద్య గురించి ప్రాధమిక అవగాహన - ప్రాధమిక సమాచారం.
విద్యార్హత : ఇంటర్‌ బై.పి.సి విద్యార్ధులు రాష్ట్రంలో EAMCET ద్వారా మరియి జాతీయస్థాయిలో అఖిల భారతస్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల ద్వారా ఈ కోర్సులలో చేరానికి అర్హత సాధించవచ్చు.
జాతీయ స్థాయిలో మెడికల్‌ కళాశాలలో(AIIMS, ZIPMER, AFIMC CMC,MGIMS) చేరాలంటే ఆయా సంస్థలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయవలసి ఉంటుంది.
ఎం.బి.బి.ఎస్‌ కాలవ్యవధి నాలుగున్నర సంవత్సరాలు. ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ప్రవేశానికి EAMCET రాయాలి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సీట్ల సంఖ్య 4,400 కాలేజీలు : 33.
బి.డి.ఎస్‌ : (డెంటల్‌) కాలవ్యవధి నాలుగున్నర సంవత్సరాలు. ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌ చేయాలి.ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సీట్ల సంఖ్య 1340.
స్పెషలైజేషన్స్‌ : ఆర్ధోడెంటిక్స్‌, డెంటో ఫేషియల్‌ ఆర్ధోపిడిక్స్‌, డెంటల్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఎండోడెంటిక్స్‌, ఆర్ధోపిడిక్స్‌ పిరియాడెంటిక్స్‌. బి.డి.ఎస్‌ తరువాత ఎం.డి.ఎస్‌ చేయవచ్చును.
బి.వి.ఎస్‌.సి & ఎ.హెచ్‌ (బ్యాచలర్‌ ఆండ్‌ వెటర్నరీ సైన్సెస్‌ అండ్‌ యానిమల్‌ హజ్‌బెండరీ)
కాలవ్యవధి : 5 సంవత్సరాలు. పరిశోధనారంగంలో మంచి అవకాశాలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి.
బి.యు.ఓం.ఎస్‌ - బి.ఎ.యం.ఎస్‌ ఆయుర్వేదం - మొక్కలు వాటి విలువలు తెలియచేసే వైద్యవిధానమే అయుర్వేదం. అతి పురాతనమైన భారతీయ సంప్రదాయ వైద్యం.
కాలవ్యవధి : 5 సంవత్సరాలు.
బి.హెచ్‌.ఎం.ఎస్‌ : (హోమియోపతి) దీనికి ఆద్యుడు జర్మనీ దేశానికి చెందిన క్రిస్టియన్‌ శామ్యూల్‌ హానెమన్‌.
కాలవ్యవధి : 5 సంవత్సరాలు.(డిగ్రీ మరియు ఇంటర్న్‌షిప్‌ కలిపి) పి.జి.కోర్సు - ఎం.డి. 3 సంవత్సరాల కాలవ్యవధి. బి.ఫార్మ్‌ :(ఫార్మసిస్టులు) కాలవ్యవధి నాలుగు సంవత్సరాలు.ఈ కోర్సు చేసినవారు మాత్రమే మందులు ఇవ్వాలి.ఫార్మసూటికల్‌ రంగంలో మంచి అవకాశాలు కలవు.
నేచురోపతి ప్రకృతి వైద్యవిధానం. కూరగాయలు, పండ్లరసాలతో, అవిరిస్నానం మొదలైన చికిత్సా పద్దతులు. ఈ కోర్సు అందిస్తున్న కాలేజీలు రెండు మాత్రమే
1. గాంథీ నేచర్‌ క్యూర్‌ కాలేజి - హైదరాబాద్‌
2. నారాయణ నేచర్‌ క్యూర్‌ - నెల్లూరు
ఫార్మా.డి ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాచే కొత్తగా ప్రవేశపెట్టబడిన కోర్సు.
కాలవ్యవధి : 6 సంవత్సరాలు.క్లినికల్‌, రిసెర్చ్‌ రంగాలలో అవకాశాలు ఎక్కువ.
3 సంవత్సరాలు కాలేజిలో చదువు. రెండు సంవత్సరాలు ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలలో ఇంటర్న్‌షిప్‌. చివరి సంవత్సరం పరిశోధన. ఆంధ్రప్రదేశ్‌లో 15 కాలేజీలు కలవు. ఒక్కోక్క కాలేజీలో 30 సీట్లు కలవు.
బి.ఎం.ఎల్‌.టి బ్యాచులర్‌ ఆఫ్‌ మెడికల్‌ లేబోరేటరీ టెక్నాలజి కోర్సు. బి.ఎస్‌.సి. మెడికల్‌ లాబ్‌ టెక్నాలజి కోర్సు.
బయోకెమికల్‌ లేబోరేటరీల్లో జరిపే డయాగ్నసిస్‌ ఖచ్చితత్వాన్ని నిర్ణయించే ప్రాక్టికల్‌, టెక్నికల్‌ ప్రయోగాలు.
బి.పి.టి (ఫిజియో థెరపి) వికలాంగులకు, ప్రమాదాల్లో గాయపడినవారికి సేవలు చేస్తుంటారు అగ్రికల్చర్‌ : బి.ఎస్‌.సి. అగ్రికల్చర్‌ అనుబంధ కోర్సులకు EAMCET రాయాలి.
కాలవ్యవధి : నాలుగు సంవత్సరాలు ఆచార్య ఎన్‌.జి. రంగా యూనివర్శిటీ ఆధ్వర్యంలోని కాలేజీల్లో ఈ కోర్సును చదవవచ్చును. ప్రైవేట్ కాలేజీలు కూడా బి.పి.టి కోర్సును అందిస్తున్నాయి