సైన్స్ విభాగాన్ని అవకాశాల వెల్లువగా అభివర్ణిస్తుంటారు. ఎంచుకునే వారి సంఖ్య, వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలతోపాటు ఉన్నతవిద్య అవకాశాలూ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లకు ఇది మరింత వర్తిస్తుంది. కానీ బీఎస్‌సీ విషయానికి వచ్చినపుడు.. ఐటీ, కంప్యూటర్ రంగంలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌లో మేథమేటిక్స్ సబ్జెక్టు ఉన్నవారికి అవకాశాలు ఒకప్పుడు ఎక్కువ.
అయితే ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం సాధిస్తే సబ్జెక్టుతో సంబంధం లేకుండా సంస్థలు తీసుకుంటున్నాయి.
ప్రోగ్రామర్ల అవసరం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ ఉంది. బహుళ జాతి సంస్థలు కూడా బీఎస్‌సీతోపాటు టెక్నికల్ నైపుణ్యాలున్నవారిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి.
బీఎస్‌సీ కంప్యూటర్స్ (మేథమేటిక్స్, కంప్యూటర్ సైన్స్) విద్యార్థులు ప్రోగ్రామింగ్‌పై దృష్టిపెడితే ప్రోగ్రామర్‌గా కెరియర్ ప్రారంభించవచ్చు. వీరు సి, సి++, జావా, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ను ఎంచుకోవచ్చు
.
https://cppinstitute.org
https://www.udemy.com/c-cplus-plus-java-programming-megaprimer-for-beginners/
https://www.udemy.com/c-c-python-ruby-javahtml5-php-programming-for-beginners
https://www.edx.org/learn/c
https://www.edx.org/learn/java
బీఎస్‌సీ- మేథమేటిక్స్ విద్యార్థులు మేథమేటికా అనే సాఫ్ట్‌వేర్‌ను నేర్చుకుంటే చాలా మంచి అవకాశాలున్నాయి. మేథమేటికా అనేది మేథ్స్‌కు సంబంధించిన గణన ప్రోగ్రామింగ్. కొన్నిసార్లు బీజగణిత ప్రోగ్రామింగ్ అనీ పిలుస్తారు. దీన్ని అనేక శాస్త్రీయ, ఇంజినీరింగ్, మేథమేటికల్, కంప్యూటర్ రంగాల్లో వినియోగిస్తున్నారు. ఈ ప్రోగ్రామింగ్‌ను కూడా వూల్‌ఫ్రామ్, జావాలోనే రూపొందించారు. సి, సి++, జావా ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్‌లు చాలా పేరున్నవి. ప్రోగ్రామింగ్ కెరియర్‌లో పునాది వీటిలో ప్రావీణ్యం సాధించడంతోనే మొదలవుతుంది. ఈ కోర్సులు ఆన్‌లైన్‌తోపాటు దగ్గర్లోని ఎన్‌ఐఐటీ, ఆప్‌టెక్ లేదా ఏదైనా ప్రైవేటు సంస్థల్లోకానీ నేర్చుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలనుకుంటే కింది వెబ్ సైట్లను చూడండి.
https://www.wolfram.com/mathematica/resources/
https://www.wolfram.com/wolfram-u/
https://www.lynda.com/Mathematica-training-tutorials/2011-0.html
https://www.onlinefreecourse.net>Academics
https://www.udemy.com/mathematica/
ఈ మేథమేటికా.. సరికొత్త సాంకేతికతలైన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లాంగ్వేజ్ వంటి వాటికి ఎంతో ఉపయోగకరం. అందుకే ఈ కోర్సు •మెరుగైన కెరియర్‌ను నిర్మించుకోవడానికీ సాయపడుతుంది. వీటితోపాటు సృజనాత్మకంగా ఆలోచించేవారైతే పైన తెలిపిన వెబ్, మల్టీమీడియా, గ్రాఫిక్ కోర్సులనూ ఎంచుకోవచ్చు.
ఈ కోర్సులన్నీ కంప్యూటర్స్, మ్యాథ్స్ వారికే కాకుండా బయాలజీ, ఇతర స్ట్రీములవారూ నేర్చుకోవచ్చు. వారి రంగాల్లో నిష్ణాతులు కావటానికి ఉపయోగకరంగా ఉంటాయి. తమ సబ్జెక్టుల పరిధిలో డేటా సైన్స్, ఏఐ కోసం ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది.