వెబ్‌సైట్లన్నీ గూగుల్, యాహూ, ఎంఎస్‌ఎన్ మొదలైన సెర్చ్ ఇంజిన్‌లపైనే ఆధారపడతాయి. ప్రత్యేకమైన కీవర్డ్స్, మెటా పదాలు, సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారా గరిష్ఠ వినియోగదారులను చేరుకోవడానికి వెబ్ పోర్టళ్లకు దారిచూపడంలో సెర్చ్ ఇంజిన్ సాయపడుతుంది. కాబట్టి ఈ సెర్చ్ ఇంజిన్లు, వాటిపైన పని చేయడానికి ఎస్‌ఈఓ/ ఎస్‌ఎంఓ ఎగ్జిక్యూటివ్‌ల అవసరం ఉంటుంది. తమ తమ వెబ్‌సైట్లను సెర్చ్ పేజీలో ముందు స్థానంలో ఉండేలా చేయడమే వీరి ముఖ్య విధి. వీరు వినియోగదారులు ఎలాంటి కీవర్డ్స్‌ను ఉపయోగిస్తారో అంచనావేసి, వాటి ఆధారంగా వెబ్‌సైట్ వచ్చేలా చేస్తుంటారు. సృజనాత్మక నైపుణ్యాలతోపాటు ఆంగ్లభాషపై పట్టు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా వీరికి అవసరమవుతాయి. ఫ్రెషర్లు... ముఖ్యంగా ఇంటర్నెట్‌పై, ఫేస్‌బుక్, ట్విటర్, గూగుల్+ వంటి సామాజిక మాధ్యమాలపై అవగాహన ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు.
నేర్చుకోవలసిన అంశాలు...
* సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, పీపీసీ
* సోషల్ మీడియా ఆప్టిమైజేషన్/ నెట్‌వర్కింగ్
* ఎస్‌ఈఓ ఆన్‌పేజ్, ఎస్‌ఈఓ ఆఫ్‌పేజ్, బ్యాక్ లింక్స్ మొదలైనవి
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నవి..
https://www.emarketinginstitute.org/free-courses/seo-certification-course/
https://www.udemy.com/courses/marketing/searchengine-optimization/
https://www.simplilearn.com/digitalmarketing/search-engine-optimization-seo-certification-training
సుమారు రూ.8000-రూ.12,000 వరకు ప్రారంభవేతనాన్ని సంపాదించే అవకాశముంది. అనుభవంతో సంపాదనా పెరుగుతుంది. ఇంటర్నెట్ వినియోగం, యాడ్ బిజినెస్, సోషల్‌మీడియా మార్కెటింగ్ విభాగాల్లో కెరియర్ నిర్మించుకోవచ్చు. సొంతంగా వ్యాపారాన్నీ ప్రారంభించుకోవచ్చు