ఇంటర్మీడియట్ విద్యాశాఖ రాష్ట్రంలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల కోసం 34 రకాల రెండేళ్ళ వృత్తివిద్యా కోర్సులను అందిస్తోంది.
వ్యవసాయం, వాణిజ్యం, హోమ్‌సైన్స్, ఇంజనీరింగ్, పారామెడికల్, హ్యూమానిటీస్ విభాగాల కింద ఈ కోర్సులను అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్య కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 61వృత్తి విద్యాసంస్థలలో స్వల్ప కాలిక కోర్సులను కూడా వృత్తివిద్యాసంస్థ అందిస్తోంది.
వృత్తివిద్యాకోర్సుల వివరణ: దీర్ఘకాలిక ఒకేషనల్ కోర్స్ అంటే రెండు సంవత్సరాల కాలవ్యవధిలో. పదవ తరగతి పూర్తయినవారు ఈ కోర్సులకు అర్హులు. సాంప్రదాయిక ఇంటర్మీడియ్‌లో ఉన్నట్లే ఇందులో కూడా అయిదు సబ్జెక్టులు ఉంటాయి. ఒకేషనల్‌లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఫౌండేషన్ అంశాలు, మూడు సబ్జెక్టులకు సంబందించిన అంశాలు వుంటాయి. నైపుణ్యాలను మెరుగుపరచటంకోసం థియరీ 50 శాతం, ప్రాక్టికల్స్ 50 శాతం వుంటాయి.నాలుగు వారాల పాటు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ వుంటుది.
స్వల్పకాలిక : పదోతరగతి ఫెయిల్ అయినవారు తేదా డ్రాప్ అవుట్స్ గా మిగిలినవారి కోసం రాష్ట్రవృత్తి విద్యా సంస్థద్యారా స్వల్పకాలిక వృత్తివిద్యా కోర్సులు రూపొందించబడ్డాయి. మూడు, ఆరు, మరియు ఏడాది కాలవ్యవధితో కొన్ని కోర్సులు ఉన్నాయి.
తక్కువ వ్యయంతోనే వృత్తివిద్యా కోర్సులను పూర్తిచేయవచ్చును. రాష్ట్రంలో 1244 కళాశాలలు ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యాకోర్సులను అందిస్తున్నాయి. ఇందులో సుమారు 550 ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలు. దీర్ఘకాలిక కోర్సులకైతే రూ.600-650 కి మించకుండా ఫీజు ఉంటుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివేవారికి ఫీజు రీఇంబర్స్‌మెంట్ కూడా ఉంది. సాంఘిక సంక్షేమశాఖ ఇచ్చే స్కాలర్‌షిప్ సౌకర్యాలు ఉంటాయి. స్వల్పకాలిక కోర్సుల్లో ప్రభుత్వ కళాశాలల్లో అయితే నెలకు రూ.300- ఫీజు చెల్లించాల్పి వుంటుంది.
సర్వీసుగా అప్రెంటెస్‌షిప్ : ప్రత్యేక నైపుణ్యాలున్న వారు ఉపాధి అన్వేషణలో ఉన్నపుడు కంపెనీలు సాధారణంగా అడిగేది అనుభవం, వృత్తి విద్యా కోర్సులు చేసేవారికి అప్రిసెంటీస్ ను అనుభవంగా పరాగణించే అవకాశాలుండటం వారికి ఊరట కలిగించే అంశం. ప్రభుత్వ నియమాకాల్లో విద్యార్థుల ఏడాది అప్రిసెంటీస్ కాలాన్ని అనుభవంగా పరిగణించాలని కేంద్ర అప్రిసెంటీస్ బోర్డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు మూడు సంవత్సరాలలోగా అప్రిసెంటీస్ చేయాలి. ఒకేషనల్ కోర్సులు చేసిన వారికి అప్రిసెంటీస్ షిప్ ఇవ్వానికి పలు కంపెనీలు హాస్పిటళ్ళు ముందుకొస్తున్నాయి. అప్రిసెంటీస్ కాలపరిమి ఏడాది. స్టయిఫండ్ ఉంటుంది.
పారామెడికల్ : పారామెడికల్ కోర్సులు చేసిన విద్యార్థులు అప్రిసెంటీస్ షిప్ చేస్తేనే రాష్ట్ర పారామెడికల్ బోర్డులో తమ పేర్లను రిజిస్టర్ చేసుకునేందుకు అర్హులు. అప్రిసెంటీస్ షిప్ చేయనివారు ప్రభుత్వ హాస్పటల్‌లో క్లినికల్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి క్లినికల్ ఫీజు క్రింద 1000- చెల్లించాల్సి వుంటుంది. స్టయిఫండ్ వుండదు. (ఫీజులు కాలానుగుణంగా మారుతూ ఉండవచ్చు. చేరేముందు ఫీజుల గురించి విచారించాలి ).