ఆదిభట్ల నారాయణదాసు హరికథా పితామహుడు, పండితుడు, బహుభాషావేత్త.
వీరు శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా అజ్జాడ గ్రామంలో 1934 సం.లో జన్మించారు.
తండ్రినుండి పాండిత్యం, కవితా కౌశలం తల్లినుండి రసభావుకత్వాన్ని దాసు సంపాదించుకొన్నారు. .
వ్రాయడం సరిగా నేర్వని రోజులలోనే భాగవతాన్ని రాగయుక్తంగా నేర్చుకున్నారు. దాసు మొదట యక్షగానాలను తరువాత హరికథా ప్రబంధాలను రచించి, కార్యక్రమాలలో పాల్గొనుటయే కాకుండా శిష్యులకు కూడా నేర్పారు. అనేక రాజసంస్థానాలలో సత్కారం పొందారు. .
దాసుగారు గడించి కీర్తిని గుర్తించి ఆనంద గజపతి మహారాజు ఆయనను తన దర్బారులో పండితునిగా నియమించారు. 1919 సం.లో విజయరాయ గజపతి స్థాపించిన సంగీత పాఠశాలకు దాసుగారు అధ్యక్షునిగా పనిచేసారు. .
నారాయణదాసుగారు 1945 సం. లో పరమపదించారు.