header

Ballari Raghava… బళ్లారి రాఘవ

Ballari Raghava… బళ్లారి రాఘవ
వీరి అసలు పేరు రాఘవాచార్యులు. తొలితరం సుప్రసిద్ధ రంగస్థల మరియు సీనీ నటులు. తన నటనా చాతర్యుంతో ప్రేక్షకులను మెప్పించి నేటికి ప్రజల మనసులలో నిలచిపోయిన మహానటుడు బళ్లారి రాఘవ.
శ్రీ రాఘవ అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1880 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. ఇతని తండ్రి అష్టావధాని, పండితుడు. తల్లి ఆంధ్ర నాటక కళాకారుడైన ధర్మవరం రామకృష్ఱమాచార్యులు గారి చెల్లెలు. వంశపారంపర్యంగా బళ్లారి రాఘవకు కూడా కళారంగపు లక్షణాలు వచ్చాయి.
బళ్లారి రాఘవ ఉన్నత విద్యావంతుడు. బళ్లారిలో మెట్రిక్యులేషన్ చదివి మద్రాసులో డిగ్రీ తరువాత లా చదివి న్యాయవాద వృత్తి చేపట్టారు. క్రిమినల్ లాయర్ గా పేరుప్రతిష్టలు, ధనం ఆర్జించారు. బ్రిటీష్ ప్రభుత్వం వీరిని పబ్లిక్ ప్రాసిక్యటర్ గా నియమించి ‘రావు బహుదూర్’ అనే బిరుదునిచ్చింది.
చిన్నతనం నుండే నటనపట్ల ఆసక్తిగల బళ్లారి రాఘవ తన పన్నెండవ ఏటనే నాటకాలు వేయటం ప్రారంభించాడు. వీరి మొదటి నాటకం సునందినీ పరిణయం. ఈ నాటకంలో బళ్లారి 72 సం.రాల వృద్ధుని పాత్ర ధరించాడు. అప్పటికి ఇతని వయసు కేవలం 27 సం.రాలు మాత్రమే.
హరిశ్ఛంద్ర, పాదుకా పట్టాభిషేకం, బృహన్నల, సావిత్రి, రామదాసు పాత్రలను సమర్థవంతంగా పోషించాడు.
హిరణ్యకశిపుడు, దుర్యోధనుడు, మాయలఫకీరు ప్రతినాయలకుల పాత్రలను కూడా పోషించారు. వీరి నాటకాలను జనం విరగబడి చూసేవారు.
వీరు శ్రీలంక, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ అనేక దేశాలలో తిరిగి తెలుగు నాటక రంగ వైభవం గురించి ప్రసంగించారు. 1928 సం.లో బళ్లారికి ఇంగ్లండ్ లో జార్జ్ బెర్నాడ్ షాతో పరిచయమైంది. అప్పడు ఆయన అన్న మాటలు మరచిపోలేనివి. అవి మీరు గనుక ఇంగ్లాండ్ లో పుట్లివుంటే ‘షేక్స్ పియర్’ అంతటి కీర్తి పొందేవారు అని అన్నారట. 1919 బెంగుళూరులో రాఘవ నటించిన పఠాన్ రుస్తుం నాటకాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ చూసి రాఘవను ప్రశంచించారు.1927లో మహాత్మా గాంధీకూడా రాఘవ నాటకాన్ని చూసి ఆనందం పట్టలేక రాఘవ మహారాజ్ కి జై అని అన్నారంటారు. రాఘవ నటించిన ఇంగ్లీషు నాటకాలు చూసిన వారు రాఘవ తెలుగువారంటే నమ్మేవారు కాదు. భాషమీద నటన మీద అంత పట్టు ఉండేది రాఘవకి. ఆరోజులలో అనేక మంది స్త్రీలను రంగస్థలానికి ఆహ్వానించి పరిచయం చేసారు.
1956లో ‘ద్రౌపదీ మానసంరక్షణం’ అనే సినిమాలో ధుర్యోధనుని పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించారు.
తరువాత ఆధ్యాత్మిక జీవితం వైపు మొగ్గుచూపారు. అడిగినవారికి కాదనకుండా ధనసహాయం చేసేవారు. అత్యంత ధనవంతుడైనప్పటికీ, నిరాడంబర జీవితం గడిపాడు.
చివరి దశలో అనారోగ్యం చేత బాధపడుతూ 16 ఏప్రియల్ 1946 సం.లో ఈ మహానటుడు శాశ్వతంగా కన్నుమూసారు.