తెలుగుదనం, లావణ్యం, సొగసు వీటి సమ్మేళనమే బాపు చిత్రం. అందానికే అందాన్నిస్తాయి బాపు బొమ్మలు. ఇతని చిత్రాలలో నృత్యం, సంగీతం రెండూ రెండు కళ్లు. గీతలలో లాలలిత్యం, కారుణ్యం తొణికిసలాడుతాయి, నాట్యం చేస్తాయి.
చూపరులను అలరిస్తాయి, మైమరిచిపోయేలా చేస్తాయి. బాపూ రేఖాచిత్రంవేసినా, వర్ణ చిత్రం వేసినా, కార్డూన్ గీసినా ప్రతి దాంట్లో ప్రత్యేకత కనబడుతుంది. కొన్ని వేల రేఖా చిత్రాలను, కార్డూన్లకు, పుస్తకాలకు ముఖ చిత్రాలను రాజకీయ వ్యంగ్య చిత్రాలు, కామిక్స్, భారత భాగవత, రామాయణ గ్రంధాలకు బొమ్మలు వేసాడు.
ఈ ప్రఖ్యాత తెలుగు చిత్రకారుడు పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో 1933 డిసెంబర్ 15న జన్మించాడు. ఇతను తల్లిదండ్రులు సూర్యంకాంతం, వేణుగోపాలరావు.
బాపు అసలు పేరు సత్తరాజు లక్ష్మీనారాయణ. ఇతను కేవలం చిత్రకారుడే కాకుండా తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. బాపు ఒక జాతీయస్ధాయి కళాకారుడు