ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయవాది సాహితీ వేత్త, ఐన బెజవాడ గోపాలరెడ్డి 1907 సం.లో నెల్లూరు జిల్లాలో జన్మించాడు. శాంతినికేతన్ లో విద్యాభ్యాసం సాగించాడు. రవీంధ్రనాథ్ ఠాగూర్ చే ప్రభావితుడై ఊర్దూ, బెంగాల్, పర్షియన్ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో 1939 సం.లో చిన్నతనంలోనే మంత్రి అయ్యాడు.
క్విట్ ఇండియా సమయంలో కారాగారం పాలై శిక్ష అనుభవించాడు. 1947సం.లో ఓ పి రామస్వామి రెడ్డియార్ మంత్రివర్గంలో మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 1955 సం.లో కాంగ్రెస్ తరపున ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ప్రజాపార్టీ, కృషికార్ లోక్ పార్టీతో కలసి మిశ్రమ ప్రభుత్వాన్ని నిర్వహించాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు ఆర్ధిక, అంతరంగిక శాఖలను నిర్వహించటం జరిగింది. 1958 సం.లో కేంద్ర మంత్రిమండలి సమాచార శాఖ, ప్రసారశాఖలను నిర్వహించారు. .
1747 సంవత్సరంలో తెలుగు భాషాభివృద్ధికై విజ్ఞాన సర్వస్వాన్ని అందివ్వటానికి గానూ మద్రాసులో వ్యవస్థాపితమైన తెలుగు భాషా సమితికి అధ్యక్షులై 1986 వ సం. వరకు కొనసాగారు. 1957-80 సంవత్సరాల మధ్యలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్ష స్థానం వహించి పలువురికి ప్రోత్సాహం అందించారు. రవీంద్రుని విసర్జన్ మొదలగు వాటిని తెలుగులోని అనువదించారు. ఇక్బాల్ కవితలను కూడా తెలుగులోనికి అనువదించారు. ఆమె, తరంగణి ఎనిమిది ఖంఢకావ్యాలను ప్రచురించారు.