header

Bulusu Samba Murthy…బులుసు సాంబమూర్తి

Bulusu Samba Murthy…బులుసు సాంబమూర్తి
ప్రసిద్ధ దేశ సేవకుడు, ప్రజానాయకుడు, బులుసు సాంబమూర్తి 1886 సం.లో తూర్పు గోదావరి జిల్లా దుళ్ల గ్రామంలో జన్మించాడు. 1911 సం.లో కాకినాడలో న్యాయవాద వృత్తి స్వీకరించి పేరు ప్రఖ్యాతులతో పాటు ధనాన్ని కూడా సంపాదించాడు. 1919 సం.లో హోమ్ రూల్ ఉద్యమంలో ప్రవేశించాడు. ఆ మరుసటి సంవత్సరం గాంధీజీ బోధనలకు ప్రభావితుడై న్యాయవాద వృత్తిని వదలి సహాయనిరాకరణోద్యమంలో చేరారు.
1927 సం.లో నాగపూర్ పతాక సత్యాగ్రహ దళానికి నాయకత్వం వహించారు. 1928 సం.లో హిందూస్తానీ సేవాదళం అధ్యక్షునిగానూ తరువాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగానూ, 1929 సం.లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడుగానూ, 1935-37లో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగానూ పనిచేశారు. 1928 సంలో సైమన్ కమీషన్ బహాష్కరణోద్యమంలోనూ, 1930 సం.లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942 సం.లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని తద్వారా కారాగార శిక్షలను అనుభవించారు.
1936 సం.లో కాంగ్రెస్ మంత్రివర్గ పరిపాలనలోమ మద్రాస్ రాష్ట్ర శాసనసభకు సభాపతిగా పనిచేశారు. 1958వ సంవత్సరంలో 72వ ఏట స్వర్గస్తులైనారు.