లక్షీనరసింహం గారు సుప్రసిద్ద తెలుగు నాటక రచయిత, పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లిలో 1876 సెప్టెబంబర్ 26వ తేదీన జన్మించారు. ఇమ్మానేని నరసింహారావు అప్పట్లో నాటకసమాజాలు పెట్టి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు. అతనికోసం వచనంలో మొదట నాటకాలను చిలమర్తి వారు రచించారు. వీరి తొలి నాటకం కీచకవధ, ద్రౌపదీ పరిణయం, శ్రీరామ జననం, గయోపాఖ్యానం, పారిజాతాపహరం, నలచరిత్ర, సీతా కళ్యాణం నాటకాలను వ్రాసారు. అప్పటి రంగస్థల అవసరాలకు సరిపోయే నాటకాలను రాశారు. 1920 సం.నుండి తన నాటకాలో పద్యాలను కూడా ప్రవేశ పెట్టారు. మొదట్లో వ్రాసిన గయోపాఖ్యానం మొదలైన నాటకాలలో పద్యాలను చేర్చి ప్రజాభిమానాన్ని పొందారు. అనేక సంస్కృత నాటకాలను కూడా ఈయన తెలుగులోకి అనువదించారు. పార్వతీ పరిణయం ఆయన తొలి రచన. బాణుని నాటకాలన్నిటికి తెలుగులోనికి అనువదించి ప్రచురించారు. దృష్టిలోపం ఇతని రచనలకు అడ్డు రాలేదు. ఉత్తమ నవలల పోటీలో కందుకూరి వీరేశలింగం పెట్టిన పోటీలలో చిలకమర్తి వ్రాసిన రామచంద్ర విజయానికి చింతామణి బహుమతి లభించింది. ఈయన వ్రాసిన హేమలత, అహల్యాబాయి, కర్పూర మంజరి, సౌందర్యతిలకం కూడా ప్రధమ బహుమతులు పొందాయి. వీరు వీరేశ లింగం పంతులు గారిని తన గురువుగా స్వీకరించారు. 1910 సం.లో దేశమాత అను వారపత్రిక పెట్టి సంపాదకుడుగా వ్యవహరిస్తూ రామాయణం, ధర్మవిజయం అను గ్రంధాలను ప్రచురించారు. బ్రిటీష్ పాలకుల అన్యాయాలను విమర్శిస్తూ అనేక వ్యాసాలు వ్రాసారు. 1911 సం.లో వచ్చిన వాడుభాష, గ్రాంధిక భాషా వివాదంలో గ్రాంధిక భాషోద్యమాన్ని సమర్ధిస్తూ వ్యాసాలు రాశారు. 1905 చిలకమర్తి వారు వ్రాసిన ఈ క్రింది పద్యం చిలకమర్తి దేశభక్తిని తెలుపుతుంది. భారత ఖండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలై యేడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియగట్టి. 1934 సం.లో ఆంధ్ర విశ్వవిద్యాలయం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారికి కళాప్రపూర్ణ బిరుదాన్ని ఇచ్చి సత్కరించింది. 1945 సం.లో ఏప్రియల్ 17 తేదీన వీరు స్వర్గస్తులైనారు.