ఆంధ్రదేశంలో ప్రముఖ చిత్రకారులలో ఒకరు. 1897 మార్చి 8వ తేదీన రాజమండ్రిలో జన్మించాడు. చిన్నతనం నుంచి ఇతనికి చిత్రకళ పట్ల అమితమైన అభిరుచి ఉండేది. అప్పట్లో రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీలో ఆస్వాల్డ్ కూట్డ్రడే అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాల్ గా ఉండేవాడు. ఆయన గొప్పకవి, చిత్రకారుడు కూడా. పదేళ్లు నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి అతనికి చిత్రకళలోని మెలకువలు నేర్పించి ప్రోత్సహించాడు.
తరువాత కూల్డ్రే సొంత ఖర్చుల మీద రామారావును బొంబయిలోని జె.జె. స్రూల్ ఆఫ్ ఆర్ట్స్ కు చిత్రకళ నిమిత్తం పంపాడు. చివరి సంవత్సరంలో ప్రధమ శ్రేణిలో పాసై -`బంగారు పతకాన్ని’ సాధించాడు. వెంటనే అక్కడే వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగానికి ఆయనకు ఆహ్యానం వచ్చింది. కానీ స్వంత రాష్ట్రంలోనే కళాసేవ చేయాలన్న కోరికతో రాజమండ్రికి తిరిగి వచ్చాడు. 1922 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన ప్రదర్శనలో ఈయన ప్రదర్శించిన రుష్యశృంగ బంధనం చిత్రానికి ప్రధమ బహుమతిగా వైస్రాయ్ ఆఫ్ ఇండియా పతకం వచ్చింది. అంతే కాకుండా అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావును స్వయంగా పరిచయం చేసుకొని ఆయన వేసిన చిత్రాలలో ఒకదాన్ని కొన్నాడు.
సిద్ధార్ధుని రాగోదయం, బావిదగ్గర వంటి రామారావు చిత్రాలు దేశ, విదేశాలలో ఎన్నో ప్రశంసలు పొందాయి.
1923 సంవత్సరంలో రామారావు రాజమండ్రిలో ఒక చిత్రకళా పాఠశాలను స్థాపించి చాలా మంది యువకులకు శిక్షణను ఇచ్చారు.
1925 సం.లో 27 సంవత్సరాలకే ఈయన అకాల మరణం చెందాడు. ఈయన చిత్రాలను రాజమండ్రిలోని దామెర్ల రామారావు ఆర్ట్స్ గ్యాలరీలో భద్రపరచబడినవి.