పశ్చిమ గోదావరి జిల్లా పిఠాపురం సమీపంలో గల చంద్రపాలోలో 1897 సం. నవంబర్ 15వ తేదీన కృష్ణశాస్త్రి జన్మించాడు. తండ్రి వెంకటకృష్ణ శాస్త్రి. పెదతండ్రి సుబ్బరాయ శాస్త్రి. వీరివురూ పిఠాపురం ఆస్థాన కవులు, దేవులపల్లి సోదర కవులుగా పేరుపొందినవారు. కృష్ణశాస్త్రి తెలుగులో భావ కవిత్వోద్యమానికి మూలస్థంభం.
కృష్ణశాస్త్రి కాకినాడ పి.ఆర్ కళాశాలలో పట్టభద్రుడై ఆ కళాశాలలోనే కొంతకాలం తెలుగు పండితుడుగా పనిచేశారు. శాంతినికేతనం, విశ్వభారతి సందర్శించి రవీంద్రుని గురువుగా స్వీకరించారు. ఈయన కృతులలో కృష్ణపక్షం, ఊర్వశీ ప్రవాసం ప్రధానమైనవి. మహావక్తగా, తెలుగు చలన చిత్రాలలో లలిత గీతాలు వ్రాసిన మధురకవిగా పేరుపొందారు. కొన్నాళ్లు హైదరాబాద్ రేడియో కేంద్రంలో కార్యక్రమ ప్రయోక్తగా కూడా పనిచేయటం జరిగింది.
కళాప్రపూర్ణ, పద్మభూషణ బిరుదులు పొందినవాడు. కేంద్రా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఐన ఈయన 1980 ఫిబ్రవరి 24న అస్తమించారు.