నిరతాన్న దాతగా పేరు ప్రతిష్టలను ఆర్జించిన తెలుగింటి ఆడపడచు డొక్కా సీతమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని లంకల గన్నవరం గ్రామస్తురాలు. తండ్రి అన్నపిండి భవానీ శంకర్. తల్లి నరస్సమ్మ. ఈమె భర్త జోగన్న. వీరిది అన్యోన్య దాంపత్యం.
అతిధులు ఏ వేళ వచ్చినా కూడా లేదు అనకుండా ఆప్యాయతతో ఆదరించి భోజనం పెట్టేది. భర్త కూడా అన్నివిధాల సహకరించేవాడు.
ధాతు కరువు సంభవించినపుడు ఈ దంపతులు చేసిన సేవ మరువలేనిది.
సీతమ్మ చేస్తున్న అన్నదాన విశిష్టత గురించి తెలుకున్న ఆ నాటి బ్రిటీష్ పాలకులు ఒక ప్రశంశా పత్రాన్ని, బంగారు పతకాన్ని అందించి సత్కరించారు. ఈ సంఘటన 1903 సం.లో జరిగింది. 1909 సం.లో డొక్కాసీతమ్మ స్వర్గస్తులైనారు. గోదావరి జిల్లాలలో ప్రజల మనస్సులలో ఈ ధన్యజీవికి ఇప్పటికీ స్థానం ఉంది.