header

Duggirala Gopalakrishnaiah

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

ఆంధ్రుల్లో రత్నాల వంటివారు ఎందరున్నా అసలుసిసలైన రత్నం ఆంధ్రరత్న ఒక్కరే, ఆయనే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. లక్షలాది జనులను తన ప్రసంగంతో కదిలించగలిగిన సమర్ధుడు ఆయన ఎందరో మహావ్యక్తుల ఉపన్యాసాలు విన్న మేథావి సర్ సి.ఆర్.రెడ్డి. సి.ఆర్.రెడ్డి, గోపాలకృష్ణయ్యకు సరితూగే ప్రసంగీకులు ఎవరూ లేరంటే ఆంధ్రరత్న ప్రసంగం ఎంత గొప్పగా సాగేదో ఊహించవచ్చు. దుగ్గిరాల గోపాలకృష్ణ వంటి నాయకుడిని తిరిగి చూడలేరేమో అని ఆకాలంలో అనుకునేవారు.
బ్రిటీష్ వారి పన్ను విధానానికి వ్యతిరేకంగా ఒక ఊరు మొత్తం ఖాళీచేసి వేరొక ఊరికి తరలివెళ్ళిన చరిత్ర భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒకేఒక్క చోట జరిగింది. అది ‘‘చీరాల-పేరాల ఉద్యమంగా నిలిచిపోయింది. සංවිධ దానికి నాయకుడు దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ముసలి, ముతక, అనారోగ్యంతో వున్న వారు, పిల్లలు, మహిళలు మొత్తం మా దుగ్గిరాల వారు చెప్పారు. మేం అనుసరించాల్సిందే అని అందరూ సహకరించారు. 1889 జూన్ 2న పుట్టిన గోపాలకృష్ణయ్య మూడవ రోజున తల్లిని, మూడవ ఏట తండ్రిని కోల్పోయాడు. పినతండ్రి చేరదీయగా మెట్రిక్యులేషన్ వరకు చదువుకుని కొంతకాలం ప్రభుత్వ ఉద్యోగం చేసాడు. తరువాత మిత్రుడు నడింపల్లి నరసింహారావుతో కలిసి పై చదువులకు ఇంగ్లండ్ వెళ్లాడు.
ප්‍దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పుట్టింది కృష్ణాజిల్లా ఆయినా ఆయన కార్యస్థానం గుంటూరు జిల్లా. అసాధారణ తెలివితేటలు, ఎవర్నీ లెక్కచేయని మొండితనం, ఎంతటివారి మీదైనా విసురులు వేయగలిగిన గడుసుతనం ఆయనకే చెల్లింది. ఒకచోట చేరాడంటే మిగిలినవారెవరినీ, చుట్టూ వున్నవారు పట్టించుకోనంతగా ఆకట్టుకునే మాటలు వచ్చేవి ఆయన నోటివెంట అసాధారణ తెలివి ఆయనకు వరంగా దక్కిందే. అదే సమకాలీనులకు కంటగింపు అయింది, ఆయన పేదరికం తక్షణ జీవనోపాధిని వెతుక్కోవాల్సిన పరిస్థితిని సృష్టించింది.
1916లో డిగ్రీతో తిరిగి భారతదేశం వచ్చిన దుగ్గిరాల నాటి జాతీయ ఉద్యమానికి కేంద్రంగా వున్న బందరులోని జాతీయ కళాశాలలో ఉద్యోగంలో చేరాడు. కానీ తరువాత చీరాలకు వచ్చాడు. ఆయన మేధోసంపత్తికి గుర్తింపు తగ్గలేదు. దుగ్గిరాలలో ఆధ్యాత్మిక చింతన అధికం, 1920ඒలో మహానందిలో జరిగిన ఆంధ్రమహాసభకి అధ్యక్షుడిగా ఒక అంగవస్త్రం, ఒక కండువా, మెడలో రుద్రాక్షమాలతో హాజరయ్యాడు. నాటినుండి దాదాపుగా ఆయన జీవితం శ్రీరామచంద్రునికే అంకితమన్న రీతిలో సాగింది. 1921లో బెజవాడ కాంగ్రెస్ සංග්‍රඩ් సమావేశాలు సజావుగా సాగాయి అంటే అందుకు దుగ్గిరాల వారు రూపొందించిన ෙසෆාරිය సేవదళమే. వెయ్యిమంది ఎర్రని చొక్కాలు, కుంకుమ బొట్టు ధరించిన రామదండు దుగ్గిరాలకు నమ్మిన బంటులై సభలను విజయవంతంగా నడిపించారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యలోని ఆ నిర్వహణ శక్తిని అందరూ పొగిడారు. కానీ పాటి ఆంధ్రనాయకులే ఆయన్ని చిన్నబుచ్చే యత్నం చేశారు. రామదండు సహాయంతో గోపాలకృష్ణయ్య చేపట్టిన చీరాల పేరాల ఉద్యమ్నన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నా బ్రిటీష్ వారు అరెస్టు చేసి జైలుకు పంపటంతో వెనకపడింది. ఇదే అదనుగా గోపాలకృష్ణయ్యమీద గాంధీజీకి ఇతర జాతీయ నాయకులకు పితూరీలు చెప్పటం තංසචුසයිమొదలయింది. అయినా ఆయనలోని ప్రతిభకు ఆలిండియా కాంగ్రెస్ కార్యదర్శి పదవి దక్కింది. ఆ పదవి దక్కించుకున్న అతిపిన్న వయస్కుడైన తొలి ఆంధ్రుడు. జాతీయ కాంగ్రెస్ ఆఫీస్ విజయవాడలో పెట్టించింది దుగ్గిరాల గోపాలకృష్ణయ్యే
1923 కాకివాడ సమావేశాలలో ఆంధ్రరత్నకు ఎటువంటి స్థానం లేకుండా చేయగలిగారు. ప్రజాధనం వ్యక్తిగతంగా వాడుకుంటున్నాడనే ఫిర్యాదు గాంధీజీకి చేరవేశారు. గాంధీజీ పిలిచి తనని ప్రశ్నించటంతో దుగ్గిరాల మనసులోనే బాధపడ్డాడు. 1923 తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తనకు వద్దని దూరంగా జరిగాడు. తాను వ్యక్తిగా చాలా పనులు చేయగలనన్న ధీమాతో గుంటూరు చేరాడు. ‘సాధన’ అనే ఇంగ్లీషు పత్రిక, ‘రామదండు’ అనే తెలుగు పత్రికలు నడిపాడు. కాంగ్రెస్ వారి అవలక్షణాలను నాడే ఎత్తి చూపిన పత్రికలు ఆవి. ఈ పత్రికలను మూసివేయటానికి కాంగ్రెస్ నాయకులు ఎంతో శ్రమించారు. వ్యక్తుల్లో ఇంత సంకుచితభావం, ఈర్యాద్వేషాలు వుంటాయని దుగ్గిరాల భావించలేదు. అటువంటి నాయకుల మధ్య కలిసి పనిచేయటంకన్నా రామభక్తుడిగా శేష జీవితం గడపటం మంచిదనుకున్నాడు. తన భార్య ఆభరణాలు, వెండికంచం ఆమ్మిన డబ్బులతో కోదండ రామాలయం, రామలింగేశ్వర ఆలయం నిర్మాణం చేపట్టాలని భావించి పునాదుల వరకు నిర్మించాడు. తన యావదాస్తిని ఆ దేవాలయాలకే చెందాలని బహిరంగ వీలునామా రాసారు.
గుంటూరులో చిన్న ఇంట్లో మకాం ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే ఆయనకు క్షయవ్యాధి సోకింది. ప్రారంభదశలో అనుమానం వచ్చి సాటి కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ కూడా అయిన ఒకాయనకు చూపిస్తే ఆయనకు క్షయ అని తెలిసినా తొలిదశలో దానిని చెప్పకుండా దాచిపెట్టాడని అంటారుප. కేవలం 30 సంవత్సరాల వయసులోనే క్షయరోగ పీడితుడయ్యాడు. రామ్ నగర్ లో ఆయన కట్టుకున్న చిన్నఇల్లు తుఫాన్ వలన దెబ్బతిన్నది. గుంటూరులో ఊరికి చివరిలో చిన్న ఇల్లు నిర్మించుకున్నాడు. దానికి కిటికీలు తలుపులు లేవు. సొంత ఇంటిలో మరణించాలనే కోరికతోనే ఆ ఇంటిని నిర్మించుకున్నాడు,
28 మే, 1928న గృహప్రవేశం చేసి చుట్టూ వున్న పేదలకు అన్నదానం చేశాడు. జాన్ మొదటివారానికి తన జీవితం అయిపోయిందని ఆయనకు ఆర్థమైంది. జూన్ 10న వైద్యుడు చూసి పరవాలేదని చెప్పినా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నమ్మలేదు.
ఆ రాత్రి తన మంచంపక్కన ఒక చాప పరచి వుంచమన్నాడు. రాత్రి పదిగంటలవేళ బాగా దగ్గు వచ్చింది, తనను మంచంమీదనుండి చాపమీదికి మార్చమన్నాడు. అలా చాపమీద పరుండి తన ఇష్ట దైవమైన రామునిస్మరిస్తూ రాత్రి 1045 సమయంలో ప్రాణం వదిలాడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య,
తన అంత్యక్రియలు తన ఉద్యమ స్థలమైన చీరాలలో జరపాలన్నది దుగ్గిరాల కోరిక. గుంటూరు నుండి చీరాల వరకు శవయాత్ర జరిగింది. దారిలోని ప్రతిపల్లెలో తండోపతండాలుగా జనం వచ్చారు. కానీ సాటి కాంగ్రెస్ నాయకులే ఆయన్ని సరిగా పట్టించుకోలేదు. ఆంధ్రరత్న బ్రతికింది కేవలం 38 సంవత్సరాలే . దుగ్గిరాల గోపాల కృష్ణయ్య జీవితం ఒక మహత్తరమైన జీవితం.