వీరు మహాపండితులు, వ్యవహార భాషోద్యమ కర్త. ‘గిడుగు పిడుగు’ అని పేరు తెచ్చుకున్నారు. సవరభాషకు నిఘంటువును రూపొందించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాలలో అనేక మంది సవర జాతి వారు నివసిస్తున్నారు. వీరు సవర జాతిని ఉద్దరించాలనే సత్సంకల్పంతో సవర భాషను నేర్చుకుని అదే భాషలో కథల పుస్తకాలు, పాటల పుస్తకాలు, సవర-తెలుగు నిఘంటువులను తయారు చేశారు. వీటిని 1911 మద్రాసు రాష్ట్రప్రభుత్వం ప్రచురించింది. వీరి కృషికి మెచ్చి నాటి బ్రిటీష్ ప్రభుత్వం 1933లో కైజర్- ఇ- హింద్ బిరుదుతోపాటు బంగారు పతకాన్ని బహూకరించింది. మద్రాసు గవర్నర్ చిత్రపురానికి వచ్చి ప్రత్యేక దర్బారులో ఈ అవార్డును రామమూర్తికి స్వయంగా అందజేశారు
తెలుగు వారు అధికంగా ఉన్న పర్లాకిమిడిని, 200 గ్రామాలను 1935లో అన్యాయంగా ఒడిశా రాష్ట్రంలో చేర్చడాన్ని నిరసించిన గిడుగు.. 22 ఏళ్లుగా పర్లాకిమిడిలో నివసిస్తూ వచ్చిన ఇంటిని వదిలి రాజమండ్రిలో ఉంటున్న తన నాలుగవ కుమారుడి వద్దకు చేరుకున్నారు. 1936లో ఆంధ్ర విశ్వవిద్యాలయం బహూకరించిన కళా ప్రపూర్ణ బిరుదును వ్యవహారిక భాషావాదులందరికీ అంకితమిచ్చారు
వీరు తెలుగు దేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది.
బాలకవి శరణ్యం, గద్య చింతామణి వంటి గ్రంధాలను రచించారు. వీరు 1940 జనవరి 24వ తేదీన మరణించారు