ఇతను 1902లో గంజాం జిల్లా చంద్రాపురంలో జన్మించారు. వీరు నాస్తికులు సంఘసంస్కర్త. ఆంధ్రరాష్ట్రంలో నాస్తిక ప్రచారానికి, కుల, మత నిర్మూలనానికి కృషి చేసిన అత్యంత ప్రముఖ వ్యక్తి.భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడు.
తెలుగు సమాజంలో పెళ్లికి ముందే సెక్స్ పై అవగాహన, కుటుంబనియంత్రణ మొదలగు విప్తవాత్మక మార్పులు తెచ్చిన ఘనత వీరిది
వీరు పిఠాపురంలో తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు. వర్ణవ్యవస్థ, అంటరానితనానికి వ్యతిరేకంగా కృషిచేసాడు. కృష్ణా జిల్లా ముదునూరులో భార్యతో కలసి 80 మంది యువకులతో నాస్తిక కేంద్రాన్ని ప్రారంభించాడు. సాంఘిక, ఆర్థిక సమానత్వం కోసం, మూఢనమ్మకాల నిర్మూలనకు, ప్రజలలో శాస్త్రీ దృష్టి పెంపొందింటానికి కృషి చేసారు. స్వంత ఆస్తి లేకుండా ప్రజల సహకారంతో తన కార్యక్రమాలను సాగించారు.
1972 లో విజయవాడలో మొట్టమొదటి ప్రపంచ నాస్తిక సభలను నిర్వహించారు. 1980లో రెండవసారి ఇదే సభను నిర్వహించాడు.
నాస్తికత్వం, దేవుని పుట్టుపూర్వోత్తరాలు, జీవితం నేర్పిన పాఠాలు, సంఘధృష్టి, ఆర్ధిక సమానత్వం మొదలగు 16 రచనలు చేశారు.
వీరు 1975 జులై 26వ తేదీన విజయవాడలో భారతీయ గ్రామీణ వ్యవస్థలో మార్పు ఏలా తీసుకురావాలి అనే అంశంపై ప్రసంగిస్తూ మరణించారు.