header

Gurajada Appa Rao / గురజాడ అప్పారావు

Gurajada Appa Rao / గురజాడ అప్పారావు

గురజాడ అప్పారావు 1961 సంవత్సరంలో విశాఖపట్టణం జిల్లాలోని రాయవరం గ్రామంలో జన్మించారు.
ఆదునిక ఆంధ్ర కవితా పితామహుడు. ‘‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’’ దేశభక్తి గీత రచయిత.
విజయనగరంలో చదివి పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజావారి ఆస్థానంలో ఉద్యోగం చేశారు. ఆ రోజులలో గంజాం జిల్లాలోని పర్లాకిమిడిలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు తెలుగు పుస్తకాలలో వాడుక భాష ఉండాలని ఒక ఉద్యమాన్ని నడిపారు. ఈ ‘‘వ్యావహారిక భాషా ఉద్యమం ’’ అప్పారావు గారికి నచ్చటంతో ఇతన వ్రాసిన పుస్తకాలలో వాడుక భాష ఉపయోగించారు. అవన్నీ బాగా ప్రచారం పొందాయి. ఆ రోజులలో డబ్బు తీసుకుని పసిపిల్లలను వృద్ధులకు ఇచ్చి పెళ్లిచేసే కన్యాశుల్కం అనే దురాచారం ఉండేది.
ఈ దురాచారాన్ని వ్యతిరేకిస్తూ ఈయన ‘‘కన్యాశుల్కం’’ అనే గొప్ప నాటకాన్ని వాడుక భాషలో వ్రాయటం జరిగింది. ఈ నాటకం ఇప్పటికీ తెలుగు భాషలో గొప్ప నాటకంగా పేరు పొందింది. బాల్యవివాహాలను వ్యతిరేకించే ‘‘పూర్ణమ్మ’’ కథ కూడా అప్పారావు రచనలలో గొప్పగా పేరుపొందింది.
ముత్యాల సరాలు, లవణ రాజు కథ, డామన్ – పితియస్ అన్న గేయ కథలు ఇతని ఇతర రచనలు. మీ పేరేమిటి, దిద్దుబాటు ...చిన్న కథలను రచించారు. తెలుగు నేలలో నవ్యాంధ్ర కవితా వైతాళికుడుగా ప్రసిద్ధి పొందిన శ్రీ గురజాడ అప్పారావు గారు 1915 నవంబర్ 30వ తేదీన అస్తమించారు.