జిడ్డు కృష్ణమూర్తి విద్యావేత్త, కవి, రచయుత. ఇతను 1895 సం. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించాడు. తండ్రి నారాయణయ్య, తల్లి సంజీవమ్మ. ఇతను అంతర్జాతీయ ఖ్యాతిని అర్జించిన ఆంధ్ర దార్శనికుడు.
మద్రాసులోని దివ్యజ్ఙాన సమాజంలో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఈ సమాజం అధ్యక్షురాలు అనిబిసెంట్, లెడ్ బీటర్ వంటి ప్రముఖులు ఒకనాడు దివ్వజ్ఙాన సమాజంలో ఆడుకుంటున్న కృష్ణమూర్తిని చూసి ఇతను కానున్న జగద్గురువుగా నిర్ధారించుకొని ఇతని తండ్రి కృష్ణమూర్తి అతని తమ్ముడు నిత్యానందల పోషణభారం స్వీకరించారు. కానీ ఏ విద్యాసంస్థలోనూ కృష్ణమూర్తి ఎక్కువకాలం ఉండలేకపోయాడు. స్వయంగానే పాండిత్యం సంపాదించి తన 15వ ఏటనే ‘‘ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్’’ అనే గ్రంధాన్ని ఇంగ్లీష్ భాషలో రచించాడు. ఈ గ్రంధం తరువాత 27 ప్రపంచ భాషలలో అనువదించబడింది. తన 16వ ఏట ప్రప్రధమ దార్శనికోపన్యాసం ఇచ్చారు.
1922 సం.లో యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియాలో ఉండగా ఒక ఆధ్యాత్మిక అనుభవానికి లోనైకృష్ణమూర్తిగారు సత్యసందర్శనం చేయటం జరిగింది.
అప్పటి నుండి ఈయన బోధనలు క్రొత్తతోవ పట్టాయి. 1926 సం.లో ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ను ఆయన రద్దు చేశారు. జాతి, దేశ, మత, రాజకీయ భావాలకు అతీతమైన విద్య బాలబాలికలకు అందించడమే నూతన ప్రపంచ నిర్మాణనికి మార్గమని ఆయన నమ్మి భారతదేశంలోని రుషివ్యాలీ, బెంగుళూరు, వారణాసి మరియు ఇంగ్లాండ్, అమెరికాలలో ఆరు ఆదర్శ పాఠశాలలె నెలకొల్పి వాటి నిర్వహణకై తగు ఏర్పాట్లు చేయటం జరిగింది.
జిడ్డు కృష్ణమూర్తి తన జీవితకాలంలో 712 గ్రంధాలు రచించారు. కాలిఫోర్నియాలోని ఓజై అనే ప్రాంతంలో ఒక కుటీరంలో 90వ ఏట 1986 ఫిబ్రవరి 17న అస్తమించారు.