ఆంధ్ర పునరుజ్జీవన ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన వారు లక్ష్మణరావు. 1876 మే 12వ తేదీన కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని పెనుగంచిప్రోలులో జన్మించారు. సంస్కృతం, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, హిందీ, గుజరాతీ, బెంగాలీ, కన్నడం, తమిళం వంటి పలు భారతీయ భాషలలో నిష్ణాతుడైన పండితుడు. లక్ష్మణరావు పండితుడు 1912 సం.లో తెలుగు భాషలో విజ్ఙాన సర్వసం ఆ కారం మీద శీర్షకలతో రెండు సంపుటాలు ప్రకటించారు. ఆయన అనేక భాషలను నేర్చినప్పటికీ తెలుగులో వ్యాసాఃలు వ్రాసి జనాభా వంటి ప్రముఖ తెలుగు పత్రికలకు పంపుతుండేవారు. పరిశోధనలు చేసి శివాజీ చరిత్ర వ్రాసారు. తండ్రి తర్వాత మునగాల సంస్థానానికికి దివానుగా పనిచేశారు. రాజాగారైన వెంకట రంగారావుతో పరిచయం ఏర్పడటంతో సాహిత్య సేవ చేయడానికి మంచి అవకాశం లభించింది. హైదరాబాద్ లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, విజ్ఙాన చంద్రికా గ్రంధమాల స్థాపించి తెలుగుజాతికి ఆధునిక విజ్ఙానాన్ని మొదటిసారిగా అందచేసారు. గ్రంథలయోద్యమ కృషిలో కూడా ఎక్కువగా కృషిచేసారు. విశ్వవిద్యాలయం, సంపాదకుడు, విద్యాభ్యాసం వంటి ఆధునిక తెలుగు పదాలను శ్రీ లక్ష్మణరావు గారే మొదట సృష్టించి వాడుకలోనికి తెచ్చారు. 48వ సంవత్సరంలో 1923 సం.జులై 13వ తేదీన లక్ష్మణరావుగారు స్వర్గస్తులైనారు.