header

Konda Venkatappiah / కొండా వెంకటప్పయ్య

Konda Venkatappiah / కొండా వెంకటప్పయ్య

కవి, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు దేశభక్త బిరుదును పొందిన వారు కొండా వెంకటప్పయ్య. గుంటూరులో విద్యభ్యాసం పూర్తయిన తరువాత మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి మొదలు పెట్టాడు. కృష్ణాపత్రికను ప్రారంభించి కొంతకాలం సంపాదకుడుగా పనిచేశాడు. 1913 సం.లో బాపట్లలో జరిగిన ప్రధమాంధ్ర మహాసభకు కార్యదర్శి పదవిని చేపట్టి కాంగ్రెస్ నాయకత్వాన స్వరాజ్య సంగ్రామం మొదలుపెట్టేవరకు అకుంఠిత దీక్షతో నిర్వహించారు. గాంధీజీ సూచనలు అనుసరిస్తూ న్యాయవాద వృత్తిని కూడా తృణప్రాయంగా వదలిపెట్టి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి వంటి అనేక పదవులు నిర్వహాంచారు. గాంధీజీ నాయకత్వంలో జరిగిన వివిధ ఉద్యమాలలో వెంకటప్పయ్య గారు ప్రముఖ పాత్ర వహించారు. దీనితో బ్రిటీష్ ప్రభుత్వం ఈయనను 1921, 1930, 1932 మరియు 1942 సంవత్సరాలలో కారాగారంలో నిర్భందించారు. అఖిల భారత చరఖా సంఘంలో వెంకటప్పయ్యగారు జీవితకాల సభ్యుడుగా ఉన్నారు. హరిజనుల దేవాలయ ప్రవేశం గురించి సేవ చేసారు. వివిధ రంగాలలో వెంకటప్పయ్య గారు చేసి సేవన గుర్తించి ఆంధ్ర ప్రజానీకం ఈయనకు దేశభక్త అనే బిరుదును ఇచ్చారు. 1948 సం.లో వీరు పరమపదించారు. వెంకటప్పయ్య గారు రచించిన డచ్ అనే పుస్తకం వీరు మరణించిన తరువాత ప్రచురితమైనది