సీతమ్మ 1874వ సంవత్సరంలో పుట్టింది. తండ్రి అబ్బూరి సుబ్బారావు. భర్తపేరు కొటికలపూడి రామారావు. ఈమె వీరేశలింగం గారి సమకాలికురాలు. 1913 సంవత్సరంలో మొదటి ఆంధ్రామహా సభ గుంటూరు జిల్లా, బాపట్లలో జరిగింది. దానిలోని మహిళాశాఖకు కొటికలపూడి సీతమ్మ అధ్యక్షత వహించింది. ఆ సభలో పాల్గొన్న వారి ప్రసంగాలను వచన కవిత్వంగా రూపొందించింది. చివరి దశలో పిఠాపురం మహారాణికి విద్య నేర్పింది.
ఈమె రాసిన కొన్ని రచనలు : వీరేశలింగం గారి చరిత్ర, అహల్యాబాయి చరిత్ర, గీతా సారమనే పద్యకావ్యం...