వీరు సుప్రసిద్ధ సంగీత విద్యాంసుడు, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో గానంలోనూ, అసమాన ప్రతిభావంతుడు. ఇతను వాగ్గేయకారుడు కూడా. కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. అతి చిన్నవయసులో కచేరీలు చేసిపేరు పొందారు. ప్రపంచవ్యాప్తంగా 25 వేల ప్రదర్శనలు ఇచ్చారు.
వీరు 1930 జులై 6వ తేదీన నేటి తూర్పగోదావరి జిల్లాలోని రాజోలు తాలూకాలోని శంకరంగుప్తలో జన్మించారు
కర్నాటక సంగీత విద్యాంసులలో ‘పద్మశ్రీ‘, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూణ్’ బిరుదులు పొందిన ఏకైక విద్యాంసుడు. కొన్ని కొత్తరాగాలను ఆవిష్కరించారు.
1980 సం.లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన విద్యాంసునిగానూ, 2010 లో తిరుపతి ఆస్థాన విద్యాంసులుగా నియమించబడ్డారు.
వీరు 2016 నవంబర్ 22వ తేదీన పరమపదించారు.