వీరు జానపద గీతాల గేయకవి. ఎంకి పాటల ద్వారా పేరుపొందారు. ఈ పాటలు ఆంధ్రదేశమంతా పేరుపొందాయి.
వీరు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు.ఉపాధ్యాయునిగా పనిచేస్తూ న్యాయశాస్త్రంలో పట్టా సాధించి కొంతకాలం న్యాయవాదిగా పనిచేసారు.కొంతకాలం కళాశాలలో అధ్యాపకునిగా కూడా పనిచేశారు. తన సొంతశైలిలో ఎంకిపాటల ద్వారా ప్రసిద్ధిపొందారు. గురజాడ అప్పారావు గారివలన ప్రభావితుడైనాడు.
ఎంకిపాటలు ఒక గేయసంపుటి. ఇందులో గోదావరి మాండలికాన్ని వాడారు. వీరు చిత్ర నళినీయం అనే పేరిట ఆరు నాటకాలను వ్రాసారు అవి చిత్ర నళినీయం, ఎండమావులు, అద్దె ఇల్లు, చౌకబేరం, వడ్లగింజలోనిది, ఒకే గొడుగు అనేవి.
వీరి జనన మరణాల గురించి స్పష్టమైన ఆధారాలు లభించటం లేదు.