నాటక రచయిత, ప్రసిద్ధ ‘‘సాక్షి’’ వ్యాసాల రూపకర్త, హాస్యరస పోషడుకుగా ఆదునిక సాహిత్య చరిత్రలో ఒక గొప్ప స్ధానాన్ని సంపాదించుకున్న మహానుభావుడు పానుగంటివారు. నాటకర్తగా ప్రసిద్ధి పొందిన పానుగంటి లక్ష్మీనారాయణ రావు 1866 పిబ్రవరి 11న జన్మించారు.
ద్రోణం రాజు వెంకటరమణారావు నిర్వహించిన సువర్ణలేఖ పత్రికతో సంబంధాలు పెట్టకొని వ్యాసాలు, కథలు, ప్రహసనాలు ఈ పత్రికలో ప్రచురించేరావు. అందులో మొదటిసారిగా ‘‘సాక్షి’’ వ్యాసాలు ప్రచురితమైనాయి. ఆ తర్వాత ఆంధ్రపత్రికలో కూడా సాక్షి వ్యాసాలను ప్రచురించారు.సాక్షిలో ఈయన ప్రవేశపెట్టిన జాంఘూల శాస్త్రి ప్రజాదరణ పొందిన పాత్ర.
సారంగధర, రాధాకృష్ణ, వృద్ధ వివాహం, కంఠాభరణం, విచిత్ర వివాహం పానుగంటి వారి రచనలలో పేరుపొందినవి. కందుకూరి వీరేశలింగం ప్రారంభించిన సమాజ సంస్కరణ మహోద్యమాన్ని కొనసాగించిన వారిలో పానుగంటి వారు ఒకరు. సాక్షి ప్రసంగ వ్యాసాలు ఆనాటి సాంఘిక జీవనశైలికి అద్దం పడుతుంటారు.
విశేష ప్రజాదరణ పొందిన ఈ సాక్షి వ్యాసాలు ఆరు సంపుటాలుగా ప్రచురిచతమయ్యాయి. ఆ తరువాత మరో రెండుసార్లు తిరిగి ముద్రితమయ్యాయి.
పీఠాపురం రాజావారి సంస్థానంలో చాలాకాలం గడిపారు. `1940 సం. జనవరి 1వ తేదీన గతించారు.