పుచ్చలపల్లి సుందరయ్య స్వాతంత్ర సమరయోధుడు. పీడిత జనోద్దారణకై పాటుపడిన త్యాగశీలి. 1934 సం.లో తెలుగు నాట కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించిన ప్రజానాయకుడు. వీరు 1913 సం. మే నెల 1వ తేదీన నెల్లూరు జిల్లాలోని అలగానపాడులో జన్మించాడు.
1925 సం.లో విప్లవ భావాలు గల సోదర సమితిని ఏర్పచాడు. 1930 సం.లో చదువుకు స్వస్తి చెప్పి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండు సంవత్సరాలు కారాగార శిక్షను అనుభవించాడు. మరల 1926 లోనూ, 1939-42 మధ్య అజ్ఙాతంలో గడిపాడు. 1946 సం.లో కూడా జైలు శిక్షను అనుభవించాడు. 1946 సం.నుండి విశాలాంధ్ర ఏర్పాటుకు కృషి చేయటం జరిగింది. 1946-48 మద్య నాటి నిజాం రాష్ట్రంలో అజ్ఙాతంలో ఉండి ప్రజాపోరాటం సాగించాడు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1952-54 మధ్య రాజ్యసభ సభ్యుడుగానూ, 1955-67 సం.ల మధ్యకాలంలో రాష్ట్ర శాసనసభ సభ్యుడుగాను కొనసాగాడు. మార్కిస్ట్ కమ్యూనిస్ట్ కార్యకలాపాలలో నాయకుడుగా వ్యవహరించాడు.
సంఘసంస్కరణ, సాంస్కృతిక వ్యవహారాలు, అస్పృశ్వతా నివారణ, కులాల విభేధ నిర్మూలన, వయోజన విద్య సుందరయ్య ఎన్నుకున్న అంశాలు.
ఈ ప్రజానాయకుడు 1955 సం.మే 19వ తేదీన కీర్తిశేషులయ్యారు. ఈ నాయకుని పేర హైదరాబాద్ లో ‘‘సుందరయ్య విజ్ఙాన కేంద్రం’’ స్థాపించబడింది.