header

Royaprolu Subba Rao/ రాయ్రపోలు సుబ్బారావు

Royaprolu Subba Rao/ రాయ్రపోలు సుబ్బారావు

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని’’
అనే సుప్రసిద్ధ గేయాన్ని వ్రాసిన రాయ్రపోలు సుబ్బారావు 1914 సం.లో శాంతినికేతనంలో రవీంద్రనాథ్ టాగోర్ అంతేవాసిగా చదువుకున్నాడు. భావకవిత్వం ప్రారంభించి అశువుగా చెప్పసాగాడు. భజగోవిందం శ్లోకాలను, సౌందర్యలహరి శ్లోకాలను తెలుగులోనికి అనువదించాడు.
ఉమర్ ఖయ్యాం రుబాయీలను ఇంగ్లీషు నుండి మధుకలశంగా తెలుగులోనికి అనువాదం చేశారు. ఈయన చేతిలో గోల్డ్ స్మిత్ రచన హెర్మిట్ ను లలిత గానూ టెనిసన్ రచన డోరాను అనుమతి గానూ తెలుగు కావ్యాలుగా రూపుదిద్దుకున్నాయి. తృణకంకణం ఈయన రచయించిన సొంత పద్యకావ్యం. ఇది అమలిన శృంగారం స్థాయినందుకున్నదని పండితుల అభిప్రాయం. జడకుచ్చులు, ఆంధ్రావళి, వనమాల ఇతని ఇతర ఖంఢ కావ్యాలు.
మిశ్రమంజరికి కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. శ్రీలు పొంగి జీవగడ్డ అమరావతి పట్టణమున బౌద్దులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు అనే ఆంధ్ర ప్రశస్తిని కొనియాడుతూ వ్రాసిన ప్రసిద్ధ గేయ రచనలు. సుబ్బారావు గారి కావ్యశైలిలో రమణీయత ఉట్టిపడుతుందని సాహిత్య విమర్శకుల అభిప్రాయం.
రాయప్రోలు సుబ్బారావు గారు 1954 సం. జూన్ 30వ తేదీన సికింద్రాబాద్ లో పరమపదించారు