ప్రముఖ కార్డూనిస్ట్, రేఖా చిత్రకారుడు, బుడుగు సృష్టికర్త సత్తిరాజు లక్ష్మీనారాయణ గారు బాపుగా అందరికీ పరిచితులు. వీరు సినిమా దర్శకులుగా కూడా పేరుపొందారు.
వీరు 1933 సం. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురంలో డిసెంబర్ 1వ తేదీన జన్మించారు. న్యాయవ్యాద వృత్తిని చదివారు. కొన్నాళ్లు ప్రసిద్ధ ప్రచారరంగ ఏజెన్సీలలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. సుప్రసిద్ధ రచయిత ముళ్లపూడి వెంకట రమణతో కలిసి ఒకరు బొమ్మా, ఒకరు రచన ఇద్దరూ కలిసి బాపూ రమణీయం హాస్య – వ్యంగ్య కళాకారుల జంటగా నాలుగు దశాబ్ధాలపాటు 1949 నుండి 1990 వరకు బొమ్మ – రచనలతో అలరించారు. వీరి సచిత్ర రచనలు బాలసాహిత్యాలలో చోటుచేసుకున్నాయి.
బాలచిత్రకారుడుగా బాల పత్రికకు బొమ్మలు వేస్తూ చివరదాకా దీనినే వృత్తిగా మలచుకున్నాడు.
రేఖా సృజనాత్మకత ఈయన సొత్తు. క్విల్ పెన్నతో ఆడుతూ పాడుతూ బాపూ బొమ్మ, ముఖ్యంగా స్త్రీనిఅందంగా మలచడంలో ఈయనకు ఈయనే సాటి అని పేరుపొందారు. ఎదిరింటి అమ్మాయి బాపూ గీసిన రెండుజడల సీతలా ఉండాలనిపించే రీతిలో బాపూ చిత్రాలు ఉంటాయి. ఈయన కళాఖండాలు జనార్ధనాష్టకం, బాలరామాయణంలో రంగుల జిలుగుతో తీర్చిదిద్దిన బొమ్మలు ప్రముఖమైనవి. నైతిక విలువలుతో ఈయన సృష్టించిన వినోదాత్మక చలనచిత్రాలు సాక్షి, బుద్ధిమంతుడు, గోరంతదీపం, వంశవృక్షం, సీతాకళ్యాణం, త్యాగయ్య, సంపూర్ణ రామాయణం.
ముత్యాలముగ్గు పేరుపొందిన సినిమా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వకోసం ప్రాథమిక తరగతులకు వీడియో పాఠాలు అందించారు. 1989 సం.లో ఆంధ్రాయూనివర్శటీ ‘కళాప్రపూర్ణ’ గౌరవ డాక్టరేట్ బిరుదును ప్రధానం చేసి సత్కరించారు.