header

Siddendra Yogi/ సిద్ధేంద్ర యోగి...

Siddendra Yogi/ సిద్ధేంద్ర యోగి...

సిద్దేంద్రయోగి కూచిపూడి నృత్య గురువులలో ప్రధముడు. 15వ శతాబ్దంలో జన్మించిన ఇతను అనాధ. ఉడిపి ఆనందతీర్ధుల వారు శ్రీకాకుళంలో నెలకొల్పిన మఠంలో ఉండేవాడు. ఒకనాటి రాత్రి సిద్దేంద్రుడు కృష్ణా అని పిలుస్తూ నృత్యం చేస్తాడు. ఇది చూసి మఠాధిపతి ఇతనిలో ఉన్న ప్రతిభను వెలికి తీయటానికి ఉడిపికి పంపుతాడు. అక్కడ సిద్దేంద్రయోగి కఠోర ఆశ్రమ నియమ, నిభందనలను పాటిస్తూ చదువు కొనసాగిస్తాడు. సంస్కృతంలోనూ, నాట్యంలోనూ వేద వేదాంగాలలో నిష్ణాతుడై స్వంత ఊరుకు తిరిగి వస్తాడు.
కూచిపూడి గ్రామంలో బ్రాహ్మణ బాలకులు కొంతమందిని ఎంచుకుని వారికి సంస్కృతం, వేదం, సంగీతం, నృత్యం నేర్పించాడు. కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించే వారిని అప్పట్లో కూచిపూడి భాగవతులు అంటారు.
ఈ యోగిపై గౌరవంతో 1963వ సంవత్సరంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం అనే నృత్యశాల కూచిపూడిలో ఏర్పాటు చేయబడింది. నాట్యశాలతో పాటు విద్యార్ధులకు వసతి సౌకర్యంకూడా ఏర్పాటు చేయబడింది.
సిద్ధేంద్ర యోగి శ్రీకృష్ణ పారిజాతం, గొల్ల కలాపం అనే రెండు నృత్యనాటికలను రచించారు. ఈ గొల్ల కలాపమే నేడు ‘‘భామాకలాపం’’గా ప్రసిద్ధి కెక్కినది.