జ్ఙానపీఠ పురస్కార గ్రహీత, ప్రముఖ తెలుగు కవి, సినిమా గేయ రచయిత నారాయణ రెడ్డి. ఈయన 1931 నవంబర్ 15వ తేదీన కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేటలో జన్మించారు. ఉస్యానియా యూనివర్శిటీలో విద్యాభ్యాసం సాగించి ‘‘ఆధునికాంధ్ర కవితత్త్వం పై పరిశోధనలు జరిపి ధీసిస్ వ్రాసినందువలన డాక్టరేట్ బిరుదు లభించినది.
1954సం .లోఈయన రచించిన నవ్వని పువ్వు 1954లో అజంతా సుందరి, కర్పూర వసంతరాయలు, నాగార్జునా సాగరము, రామప్ప వంటి సంగీత రూపకాలు, దివ్వెల మువ్వలు, విశ్వనాధుడు వంటి పద్యకావ్యాలు సాహిత్య విమర్శల ప్రశంసలు అందుకున్నాయి.br/>
చలనచిత్ర రంగానికి 3,000 పైగా పాటలు వ్రాసి సుప్రసిద్ద గేయరచయితగా పేరుపొందారు.
ఈయన కృతి విశ్వంభర (1981) మహాకావ్యంగా ఎంపిక కాబడి జ్ఙానపీఠ పురస్కారం లభించింది.
ఉస్మానియా యూనివర్శిటీలో 1982 వరకు తెలుగు పీఠాధ్యక్షులుగానూ, 1982 నుండి 89 వరకు అధికార భాషా సంఘ అధ్యక్షులుగానూ ఉన్నారు. 1986 నుండి 1989 వరకు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్శిటీ ఉపాధ్యక్షులుగాను పనిచేశారు. 1989 నుండి తెలుగు యూనివర్శిటీ ఉపాధ్యక్షులుగా నియమింప బడ్డారు.
సీ.నా.రే ప్రతిష్టాత్మకమైన సోవియెట్ ల్యాండ్ – నెహ్రూ అవార్డు, అసాన్ అవార్డు వంటివి చాలా అవార్డులు వచ్చాయి. ఈయన స్వగ్రామం హనుమాజీ పేటను 1990 సం.లో ఈయన గౌరవార్ధం గ్రామస్తులు ‘నారాయణరెడ్డి పేట’ గా మార్చుకున్నారు.