ఈయన గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా వేమూలూరిపాడు గ్రామంలో 1973 డిశెంబర్ 4వ తేదీన జన్మించాడు.
ప్రముఖాంధ్ర నవలా రచయుత, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, ప్లీడర్ పరీక్ష పాసై1903 సం.లో గుంటూరులో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 1913 సం.లో ఐర్లండ్ లోని డబ్లిన్ కు వెళ్లి అక్కడ బారిస్టర్ పట్టా సంపాదించారు.
ఐర్లాండ్ స్వాంతంత్ర్యోద్యమ నాయకుడు డీవెలరాతో పరిచయం ఏర్పడటంతో ఇతనిలోని దేశభక్తిభావం మరింతగా పెంపొందింది.
1920 సం.లో మహాత్మా గాంధీ పిలుపు మేరకు బారిస్టర్ వృత్తిని వదులుకొని సహాయ నిరాకరణోద్యంలో చేరారు. అన్ని సత్యాగ్రహ ఉద్యమాలలో పాల్గొని మొత్తం మూడు సంవత్సరాల కాలం వేర్వేరు జైళ్లలో గడిపారు. 1905లో గుంటూరులో ఈయన వితంతు శరణాలయం నెలకొల్పటం జరిగింది. స్త్రీవిద్య అభివృద్ధి కోసం 1922లో గుంటూరులో శారదా నికేతనం స్థాపించారు.
సాహిత్యపరంగా కూడా శ్రీ లక్ష్మీనారాయణ చేసిన సేవ చెప్పుకోదగ్గది. ఈయన రచించిన ‘‘మాలపల్లి’’ అనే తెలుగు నవల ప్రసిద్ధి పొందినది. ఈయన దేశభక్తుడు, సంఘ సంస్కర్త మాత్రమే కాకుండా గొప్ప నవలా రచయుతగా పేరుపొందాడు. తెలుగు వారికి చిరస్మరనీయుడు.