header

Vasireddy Venkatadri Naidu

వాసిరెడ్డి వెంకటాద్రినాయిడు

వాసిరెడ్డి వెంకటాద్రినాయిడు కృష్ణా, గోదావరి మధ్యలో కాక ఆ నదులకు ఆవల విస్తరిం చిన ఐదువందల గ్రామాలమీద ఆధిపత్యం కలిగి, జనరంజకంగా పరిపాలించిన ఘనచరితుడు వాసి రెడ్డి వెంకటాద్రినాయుడు.
ఒకవైపు నిజామ్ పాలకులు, మరోవైపు బ్రిటీష్ వారి పాలనలో తనదైన ప్రత్యేక శైలిలో శక్తివంతుడయిన జమీందారుగా నిలిచినవాడు వెంక టాద్రినాయుడు.
వెంకటాద్రినాయిడు 1761, ఏప్రిల్ 20 న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు.
వీరిది కృష్ణాజిల్లాలోని చింతపల్లి సంస్థానం. 1783లో పట్టాభిషక్తుడయ్యాడు. వెంకటాద్రినాయుడు యుద్ధాలు చెయ్యలేదు. కాని ఆయన రాజ్యం విస్తరించి ధర్మప్రభువుగా పలు గ్రామాలవారు ఆహ్వానించారు. ప్రజలమీద పన్నుల భారం వేయటానికి ఆయన వ్యతిరేకి తాము ఎంచుకున్న వృత్తులను హాయిగా చేసుకునే అవకాశం, ప్రోత్సాహం అందించాడు. వైదిక ధర్మపక్షపాతి ఆయన దేవాలయాలను పునరుద్ధరించాడు. పొన్నూరు, మంగళగిరి, అమరావతి దేవాలయాల అభివృద్ధికి పాటుపడ్డాడు. తెలుగు, ఉర్ధూ, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో ఆయనకు ప్రవేశం ఉంది.
1761 సంవత్సరంలో పానిపట్టు యుద్ధంలో గెలిచిన బ్రిటీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీ పట్నం, చెన్నపట్నంలో స్థావరాలు నెలకొల్పారు. క్రమంగా ఒక్కొక్కప్రాంతాన్ని ఆక్రమించసాగారు . ఇతర జమీందారులు,పాలకులు తమ చెప్పచేతుల్లో వుండేలా చేసుకుంటూవస్తున్నారు. ఎదురుతిరిగినవారిని యుద్ధంలో ఓడించి తమవైపు వుంటేనే రాజవైభోగం నిలిచేలా చేశారు. .
వారసులు లేని జమీలు తమ సొంతమయ్యే చట్టాలు తెచ్చారు. ఇవన్నీ అభిమానధనుడయిన వెంకటాద్రినాయిడుకు నచ్చకపోయినా ఎదురుతిరగటానికి తగిన బలం లేనందును మిన్నకున్నాడు. .
ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఉత్తర్వులకు లొంగక, లౌక్యంగా వ్యవహరిస్తూన్న ప్రజల సంక్షేమం చూసుకుంటూ పాలనసాగిస్త్ను వెంకటాద్రినాయుడిని ప్రమాదకర ప్రత్యర్థిగా బ్రిటీష్ వారు భావించారు. .
ఏదో ఒక వంకతో తెల్లసైనికులు 1795 జూన్ 30న చింతపల్లికోటలోకి అడుగుపెట్టారు. ఆ సైనికులను ఆ ప్రాంత రాజు పోషించాలి. తనకు అవసరంలేని సైన్యాన్ని అప్పగించి ఖర్చు తగ్గించుకునేందుకు సాంత సైన్యం తగ్గించుకుని జమీందారులను దెబ్బతీయాలనేది వారి ఎత్తుగడ. .
చింతపల్లిలో తెల్లవారిని భరించలేక తన రాజదానిని కృష్ణానదికి ఆవల వున్న ధరణికోటకు వెళ్ళి కొత్తకోటను నిర్మించుకుని, దానిని తనరాజధానిగా చేసుకుని పాలన సాగించాడు వెంకటాద్రినాడు. .
కృష్ణా డెల్టా ప్రాంతమందు వందకుపైగా దేవాలయములు కట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి. వేంకటాద్రి నాయుని సైన్యములో వేలమంది సైనికులు, 300 గుర్రాలు, 80 ఏనుగులు, 50 ఒంటెలు, లెక్కలేనని ఎడ్లబండ్లు ఉండేవి. .
అమరావతి, చేబ్రోలు, చింతపల్లిలలో నాయుని భవనములు సంపదతో తులతూగేవి. పండుగలనాడు పండితులకు, గ్రామపెద్దల కుటుంబాలకు పట్టువస్త్రములు, బంగారు ఆభరణములు బహూకరించబడుతుండేవి. నిరతాన్నదానములు జరుగుతుండేవి.
నాయుడు ప్రభావం తగ్గించేందుకు తెల్లదొరల ఎత్తుగడలు వేస్తూనే వున్నారు. వాటిని వెంకటాద్రి నాయుడు ఛేదించుకుంటూ తన ఆత్మగౌరవం కాపాడుకుంటూనే వున్నాడు. అయినా ఆయన మీద తెల్లదొరలు రకరకాలుగా ఒత్తిడితెచ్చారు తనమిత్రులకు ఆశ్రయం ఇవ్వలేని పరిస్థితి. .
నైజాం నవాబు ఒక బిరుదు ఇస్తానంటే అది స్వీకరించేందుకు బ్రిటీష్ పాలకుల అనుమతి అడగాల్సిన దౌర్భాగ్యస్థితి. ఆ తర్వాత ఆయన తన 37వ ఏట ఒక మగ పిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. ఇతని భార్య వెర్రెమాంబ. కూతురు ప్రమాదవశాత్తూ కోటగోడమీదనుండి పడి మరణించింది. .
46వ ఏట మళ్లీ పెళ్ళి చేసుకున్నాడు. మరో మగపిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. ఇది మొదటి భార్యకు నచ్చలేదు. దాదాపుగా నాటినుండి ఆమె వెంకటాద్రినాయుడుకి దూరంగానే వుంది. పెద్దభార్య దగ్గర ఒక కొడుకు, రెండవ భార్యదగ్గర మరో కొడుకు పెరగసాగారు. .
పెద్ద దత్తత కొడుకు రెండవ దత్తత కొడుకుకు సయోధ్య ఉండేదికాదు. బ్రిటీష్ పాలకుల ఒత్తిడిల మధ్యపాలనను ఎలాగో నెట్టుకొస్తున్న వెంకటాద్రినాయుడిని అవసరం అయినపుడు తెల్లదొరలు బుజ్జగించేవారు. పిండారీలనే దోపిడీదొంగలను అణచవలసి వచ్చినప్పడు, నేరస్తులను హింసించాల్సివచ్చినప్పడు వెంకటాద్రినాయుడినే ఆశ్రయించేవారు. .
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచూ సామాన్య ప్రజలను బాధించుచుండేవారు. మంత్రి ములుగు పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేశాడు. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారింది. .
బలహీనపడుతున్న జమీందారీ వ్యవస్థ, పరాయిపాలకుల పెత్తనం, పెంపుడు కొడుకుల మధ్య లోపించిన సఖ్యత నేపథ్యంలో తాను బతికివుండగానే అన్ని వ్యవహారాలు చక్కబెట్టాలని భావించినవెంకటాద్రినాయుడు ఆస్తుల పంపకం ఆలోచన చేశాడు. వీలైనంతవరకు ఇద్దరికీ సమంగా ఆస్తులు దక్కేలా యత్నం చేశాడు. కొడుకులిద్దరు ఆస్తులకోసం తగాదాలు పడకుండా చూడాలన్నది ఆయన ఆశయం.
ఆయన చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారు.
కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశారు. వేంకటాద్రి నాయుడితో పాటుగా ఆయన మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. .
కొన్ని యాత్రలు క్రీ.శ.1802, మరికొన్ని క్రీ.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది. శేషజీవితమును అమరేశ్వరుని పాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. .
ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేటగా మార్చాడు. ఆయన తల్లి అచ్చమ పేరు మీదనె అచ్చమ్మపెటగా మారినది. .
చివరిదశలో పెద్దగా అనారోగ్యం పొడసూపినట్టు లేదు. కానీ మానసిక అనారోగ్యమే ఆయనప్రాణాలను బలితీసుకుంది ఆగష్టు 18, 1816న.
ఒకనాడు ఎంతో గొప్పగా మిగిలిన ఆంధ్రుల చరిత్రలో మరో మహత్తర అధ్యాయంనాటితో ముగిసి తెల్లవారి పాలన సుగమమైంది.