సుప్రసిద్ద తెలుగు గ్రంధ ప్రచురణ కర్త, భాషోద్దారక బిరుదాంకితులు.
వీరు రాజుల ఆస్థానాలలో, మారుమూల ప్రాంతాలలో తాళ పత్రాల మీద శిధిలావస్తలో ఉన్న అనేక గ్రంధాలను ముద్రించి తెలుగు వారికి అందించారు. 1854వ సంవత్సరంలోనే మద్రాస్ లోని అడయార్ లో ‘ఆది సరస్వతీ నిలయం’ పేరిట ముద్రణాలయాన్ని ప్రారంభించారు
శ్రీ మద్ర రామాయణం, గురుబాల ప్రభోధిక,లీలావతి గణితం, శంకరవిజయం, శబ్ధ మంజరి, విష్ణ సహస్రనామ భాష్యము మొదలగు ముఖ్య గ్రంధాలను ముద్రించారు. 1906 సంలో వీరు కుమారుడు వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రి ఈ ముద్రణాలయ భాధ్యతలను స్వీకరించారు. తరువాత ఇక్కడ కొన్ని వందల గ్రంధాలు ముద్రించబడినవి.