వెంపటి చినపత్యం ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు,. వీరు 1929 అక్టోబర్ 29వ తేదీన కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించారు. కూచిపూడి గ్రామం కూచిపూడి నాట్యానికి జన్మస్థలం. వీరు 1963 సం.లో మద్రాసులో కూచిపూడి ఆర్ట్ అకాడమీ స్థాపించారు. వీరి కృషి ఫలింగానే కూచిపడి నృత్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యతి చెందింది.
రెండు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. శ్రీకృఫ్ణ పారిజాతం, క్షీరసాగరమధనం వీరికి పేరు తెచ్చాయి. తన జీవితాన్ని కూచినూడా నాట్యకళకు అంకితమిచ్చారు. 2011 సం.లో హైదరాబాద్ లో 2800 కళాకారులతో ఏకకాలంలో నిర్వహించి కూచిపూడి నృత్య ప్రదర్శనకు గిన్నిస్ అవార్డు వచ్చింది.
1956 సం.లో భారతప్రభుత్వం వీరిని పద్మభూషన్ ఆవార్డుతో సత్కరించింది. 2012 జులై 29వ తేదీన చెన్నైలో చనిపోయారు.