భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నాట్యాలలో అంతర్జాతీయంగా పేరుపొందిన నాట్య కళాకారిణి. వీరివలనే మన కూచిపూడి నృత్యం అంతర్జాతీయంగా పేరుపొందింది.
ఈమె ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లామదనపల్లిలో 1940 డిసెంబర్ 20వ తేదీన జన్మించిది. నాట్యానికి తోడు కర్ణాటక సంగీతం నేర్చుకుని పాడుతూ నృత్యం చేసేది. 5 వ ఏటనుండే నృత్యంలో శిక్షణ తీసుకోవటం ప్రారంభించింది. 1957 సం.లో తన 17వ ఏట మద్రాసులో తొలి నాట్య ప్రదర్శన ఇచ్చింది. తరువాత మూడు సంవత్సరాలలో నృత్యంలో ఆరితేరిన కళాకారిణిగా మారింది.
అమెరికా, ఐరోపా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాలలో నృత్యప్రదర్శనలిచ్చి భారతీయ నాట్యానికి వన్నె తెచ్చింది.
ఈమె సేవలకు గాను భారత ప్రభుత్వం వీరిని ‘పద్మశ్రీ(1968), పద్మభూషణ్ (2001), పద్మవిభూషణ్ (2016)’ బిరుదులతో సన్మానించింది.
నృత్య విధానాల మీద పరిశోధన చేసి నృత్యమూర్తి అనే సీరియల్ ను తయారు చేసింది. దీనిని పదమూడు భాగాలుగా దూరదర్శన్ లో ప్రసారం చేసారు.
ఈమె బ్రహ్మచారిణి గా ఉంటూ తన జీవితన్ని మొత్తం నాట్యకళకే అంకితం చేసింది