చిదంబరం దేవాలయం పరమశివుడికి అంకితమైన హిందూ దేవాలయం. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు కడలూర్ జిల్లాలోని కారైకల్ కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో, మరియు పాండిచ్చేరి కి దక్షిణంగా 78
కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆలయనగరమైన చిదంబరం నడిబొడ్డున ఈ ఆలయం నెలకొని ఉన్నది. ప్రాచీన మరియు పూర్వ-మధ్యస్థ కాలంలో, పల్లవ , చోళ రాజుల కాలంలో, ఈ ఆలయంలో పలు నూతన రూపకల్పనలు
జరిగాయి
హిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని యొక్క ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాల కి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ,తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ ,
కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ మరియు కాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.
సర్వాలంకృతభూషితుడైన నటరాజుని చిత్రం, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. పరమ శివుడు, భరతనాట్య నృత్యం యొక్క దైవం అంటారు. మరియు శివుడికి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా మనుష్య ఉన్న
అతికొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి ఆలయంలో ఐదు ఆవరణలు ఉన్నాయి.
అరగాలూరు ఉదయ ఇరరతెవన్ పొంపరప్పినన్ (అలియాస్ వనకోవరైయన్) క్రీ.శ.1213 లో చిదంబరం లోని శివుని ఆలయాన్ని పునర్నిర్మించాడు. అదే బాణ సామ్రాజ్య ప్రముఖుడు తిరువన్నమలై ఆలయాన్ని కూడా నిర్మించాడు.
ఈ ఆలయాన్ని సనాతనంగా నడిపిస్తున్న దిక్షితార్ అని పిలువబడే, అంతర్వివాహీకులైన శైవ బ్రాహ్మణులు, అధికారిక పురోహితులు కూడా..
చిదంబరంలో పూజించబడే పరమశివుడు నిరాకార స్వరూపుడై సాక్షాత్కారిస్తాడు. స్వామి తన సతీమణి శక్తితో కలసి ఆద్యంతరహితమైన చిద్విలాసంతో "ఆనంద తాండవ" నృత్యాన్ని నిరంతరంగా చేస్తుంటాడు.
ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని తొలగించగా వ్రేలాడదీసిన బంగారు 'బిల్వ' పత్రాల వరుసలు స్వామి యొక్క సమక్షాన్ని సూచిస్తూ కనబడతాయి. తెరకి బైట వైపు నల్లగా ఉండి అజ్ఞానాన్ని సూచిస్తుంది మరియు లోపలి
వైపు ప్రకాశవంతమైన ఎరుపులో ఉండి జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని సూచిస్తుంది)
నలభై ఎకరాల విస్తీర్ణంలోని అతిపెద్ద ఆలయ ప్రాంగణం అది. ఆలయానికి ఉన్న 9 ముఖద్వారాలూ మానవశరీరంలోని 9 రంధ్రాలను సూచిస్తాయి. క్రీ.శ. రెండో శతాబ్దానికే ఈ ఆలయం ఉంది కానీ తరవాత 13వ శతాబ్దంలో దీన్ని పునర్నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ పరమశివుడు ‘నటరాజ, చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగం, ఏ రూపమూ లేని దైవసాన్నిధ్యం’ అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు. మూడోదే నిరాకార రూపంలోని ఆకాశలింగం గా చెబుతారు. అంటే గర్భాలయం వెనకగోడమీద ఓ చక్రం గీసి ఉంటుందట. దానిముందు బంగారు బిల్వ ఆకులు కట్టి వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా ఓ తెర కట్టి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూజారులు తెరను నామమాత్రంగా తొలగించి చూపుతారు. అక్కడ సాధారణ దృష్టికి ఏమీ అగుపించదు.
కానీ మనోనేత్రంతో చూడగలిగినవాళ్లకు
శివపార్వతులు కనిపిస్తారనేది నమ్మకం. స్వామివారు ఎవరికి కనిపిస్తారో ఏ రూపంలో కన్పిస్తారో తెలియదు కనుక అది చిదంబర రహస్యంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తెర తొలగించినప్పుడు కనిపించే ఆ చోటునే శివోహంభవ అనీ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనసు... ఆ దైవంలో మనసు ఐక్యం అయ్యే ప్రదేశం. అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవసాన్నిథ్యాన్ని అనుభూతించడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం.
చిదంబరం ఓ అద్భుత శక్తి క్షేత్రం. దీనికి అయస్కాంతశక్తి ఉందనీ నటరాజవిగ్రహంలోని కాలిబొటనవేలు భూమధ్యరేఖలోని బిందువని సూచిస్తుందనీ చెబుతారు. పరమశివుని ఆనంద తాండవ భంగిమ, సుప్రసిద్ధ భంగిమల్లో ఒకటి. స్వామి పాదం కింద ఉన్నది అజ్ఞానమనీ, చేతిలోని నిప్పు దుష్టశక్తులను నాశనం చేస్తుందనీ, పైకి ఎత్తిన చేయి సర్వ జగత్తునీ రక్షిస్తుందనీ, వెనక ఉన్న వలయం విశ్వానికి సంకేతమనీ, చేతిలోని ఢమరుకం జీవం పుట్టుకను సూచిస్తుందనీ చెబుతారు. భరతనాట్యం ఈ నటరాజ దేవాలయం నుంచే వచ్చిందట. గర్భాలయ దర్శనం తరవాత శివగామి సుందరిని దర్శించుకోవచ్చు